Sunday, May 12, 2024
- Advertisement -

సామాజిక సేవలోను…. శృంగారమేనా..?

- Advertisement -

పోర్న్ స్టార్ గా నోటెడై ..బిటౌన్లో నటిగా ఎంట్రీ ఇచ్చి మెలమెల్లగా ఎదుగుతోన్న తార సన్నీలియోన్ .ఈ అమ్మడు తాను చేసే సినిమాలతో మాత్రమే పాపులర్ కాకుండా చేసే పనులతోను న్యూస్ మేకర్ అయిపోతుంది. దీనికి తోడు సన్నీ ఏం చేస్తే దానికి తన భర్త డానియల్ వెబర్‌ ఫుల్ అండదండలు ఉండడంతో ఈమెను ఎవరూ కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎట్ ప్రజెంట్ ఒక స్త్రీగా, గృహిణిగా సంసార జీవితం హాయిగా ఉన్నానంటుంది సన్నీలియాన్.

ఐతే ఈ అమ్మడు ఛారిటీ సంస్థలకు, సామాజిక సంస్థలకు ప్రచారకర్తగా ఉంటూ ప్రజలలో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషిచేస్తోందనే విషయం మనకు తెలిసిందే. అమెరికా క్యాన్సర్ సొసైటీకి, పెటా సంస్థకు సన్నీ తన సేవలను అందిస్తూ సామాజిక కార్యకర్తగా పనిచేస్తోంది. ముంబైలోని ఓ పాఠశాలను దత్తత తీసుకొని ఆ స్కూల్‌కు కావల్సిన వసతులను సమకూరుస్తోంది. సన్నీలియాన్ ఓ మంచి చెఫ్ గాను పేరు తెచ్చుకుంది. అయినప్పటికీ తాను బయటకు వెళితే… తనపై ఎన్నో కామెంట్లు పడతాయని సన్నీ చెబుతుంది. వాటిని తాను చాలా లైట్ తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ఈవిషయంలోను సన్నీని మనం మెచ్చుకోవల్సిందే.

కాకపోతే…. జంతు సంరక్షణ సంస్థ పెటా(పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్)కు సన్నీలియోన్ ప్రచారకర్త అనే విషయం తెలిసిందే కదా.ఈమధ్యనే సన్నీ జంతు సంరక్షణ ప్రచారంలో భాగంగా భర్త డెనియల్ వెబర్‌తో కలిసి నగ్న ఫోటోలకు ఫోజులిచ్చింది. జంతువులను చంపి వాటి చర్మంతో తయారు చేసే వస్త్రాలను ధరించకూడదనే సందేశాన్ని ఈ నగ్నత్వంలోనే గ్రహించాలని సన్నీ అభిమానులకు కోరడం గమనార్హం. ఈ ఫోటోను పెటా ఇండియా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.ఓకే ఇది కూడా సామాజిక సేవనే అనుకుందాం. కాని ఇక్కడ ఒక తప్పు చేయెద్దు అని చెప్పడానికి పోయి…సన్నీని ఇలా నగ్నంగా నిలబెట్టి ఫొటోలు తీసి…పెటా మరో తప్పు చేస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నారు అనేదానికి మాత్రం పెటా సమాధానం చెప్పలేకపోతుంది. ఇక్కడ మ్యాటర్ ఎలా ఉందంటే…సామాజిక సేవ పేరుతో శృంగార రసాన్ని బయటకు తీసి ఎవరిని ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నారు. ఆల్ రెడీ వాత్సాయనుడు ఈవిషయాన్ని తన కామ సూత్రాలలో చెప్పేశాడు కదా. మళ్లీమళ్లీ అదే విషయాన్ని పెటా ఎందుకు చేయాలి అని నెటిజన్లు కొశ్చన్ల మీద కొశ్చన్లు అడుగుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -