Sunday, May 12, 2024
- Advertisement -

పొట్టి బట్టల్లో కనిపించింది… ఇప్పుడు భాధపడుతోంది!

- Advertisement -

టాలీవుడ్ కేరక్టర్ ఆర్టిస్టుల్లో సురేఖా వాణికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సినిమాల్లోకి కాసింత లేటుగా ఎంట్రీ ఇచ్చినా అనతి కాలంలోనే మంచి నటిగా గుర్తింపు పొందిన ఈమె.. ఆంటీ పాత్రల్లో బోలెడంత పేరు సంపాదించింది. ఇటు అందం.. అటు ట్యాలెంట్ రెండూ ఉండడంతో.. బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది కూడా. 

రీసెంట్ గా ఈమె వీడియో ఒకటి ఆన్ లైన్ హల్ చేస్తుంటే.. దాన్ని నెట్ లోంచి తొలగించాలని కోరుకుంటోందీమె. అసలు ఆ వీడియోలో ఉన్న మేటర్ ఏంటంటే.. కూతురుతో కలిసి కాలాచెష్మా సాంగ్ కు డ్యాన్స్ లు వేస్తున్న వీడియో వైరల్ అయిపోయి.. విపరీతంగా షేర్ అయిపోతోంది. అసలా డ్యాన్స్ లో కానీ.. పాటలో కానీ అసభ్యత అనేది ఏమీ ఉండదు కానీ.. సురేఖా వాణి కాసింత పొట్టి బట్టల్లో కనిపిస్తుందంతే. కానీ పబ్లిక్ టాక్ బాగా బ్యాడ్ గా ఉండడంతో వీడియోను డిలెట్ చేసేయాలని కోరుకుంటోంది. 

అయితే.. ఇప్పటికే బోలెడుసార్లు షేర్ అయిపోయి.. అప్ లోడింగ్స్ కూడా అయిపోయిన ఈ వీడియోను మొత్తంగా నెట్ లోంచి తీసేయడం అంత సులభం ఏమీ కాదు. అలాగని అసాధ్యం కూడా కాదు. కంప్లెయింట్ చేసి అభ్యంతరాలు వ్యక్తం చేస్తే డిలెట్ చేస్తారు కానీ.. ఇలాంటి వీడియోలు మళ్లీ అప్ లోడ్ అవుతూనే ఉంటాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -