Sunday, April 28, 2024
- Advertisement -

సర్‌ప్రైజ్..ఓటీటీలోకి సలార్!

- Advertisement -

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం సలార్. క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. రెండు పార్టులుగా ఈ సినిమా వస్తుండగా రెండో పార్టు కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా సినిమా ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ వచ్చేసింది. తొలుత జనవరి 15న ఓటీటీలో రిలీజ్ చేస్తామని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ప్రకటించగా తాజాగా జనవరి 20 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్‌ దాదాపు రూ. 160 కోట్లు చెల్లించినట్లు సమాచారం. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఒక హిందీలో మాత్రం విడుదల చేయట్లేదు. రిపబ్లిక్ డే సందర్భంగా హిందీ వెర్షన్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

సలార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 700 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. బాహుబలి 1, బాహుబలి 2, సాహో తర్వాత 600 కోట్లు దాటిన నాలుగో సినిమాగా సలార్ రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే సౌత్ ఇండస్ట్రీ నుంచి నాలుగు సార్లు 600 కోట్ల మార్క్ దాటిన ఏకైక హీరోగా నిలిచాడు ప్రభాస్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -