Sunday, May 19, 2024
- Advertisement -

మూడు పెళ్ళిళ్ళు… సినిమా ఫ్లాపులు…… ఏదైనా పవన్‌పైనే సానుభూతి చూపించాలా?

- Advertisement -

రేణూదేశాయ్‌తో పవన్ కళ్యాణ్ విడిపోయినప్పుడు వినిపించిన కహానీలు గుర్తున్నాయా? అత్తారింటికి దారేది లీక్ అయినప్పుడు ‘కాన్‌స్పిరసీ’ అంటూ పవన్ మాట్లాడిన పెద్ద పెద్ద మాటలు గుర్తున్నాయా? ఇప్పుడిక అజ్ఙాతవాసి విషయంలో కూడా కుట్ర, టార్గెట్ చేశారు అంటూ పవన్‌కి సానుభూతి తెచ్చిపెట్టే బ్యాచ్ అందరూ కూడా రెడీ అయ్యారు. ఈ మొత్తం ప్రచారాన్ని పవనే స్వయంగా తన డబ్బులతో తానే చేయిస్తున్నాడన్న నిజాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అసలు ఇంతకుముందు కుట్రల గురించి చర్చించుకుందాం.

ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అయినప్పుడు నాగబాబుకు కోట్ల రూపాయల్లో పవన్ సాయం చేయడంతో అది నచ్చని రేణూదేశాయ్ డబ్బు విషయంలో పవన్‌ని నిలదీసిందని అందుకే పవన్ విడాకులు ఇచ్చాడని చెప్పారు. రేణూకు కూడా భారీగా డబ్బులు ఇచ్చాడని చెప్పారు. రేణూదేశాయ్ ఫైనాన్షియల్ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలియని వాళ్ళే ఇలాంటి కహానీలను నమ్ముతారు. ఈ రోజు కూడా రేణూదేశాయ్ తన కాళ్ళ మీద తానే నిలబడి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్‌తో జీవిస్తుందన్నది నిజం. అన్నా లెజినోవాతో పవన్ ప్రేమ వ్యవహారం తెలిశాక…..అది సహించలేని రేణూ పవన్‌తో విడిపోయిందన్నది నిజం. రేణూ విడిపోయిన రెండు మూడు నెలల వ్యవధిలోనే లెజినోవాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు పవన్. అంటే రేణూతో ఉండగానే లెజినోవాతో పవన్ ప్రేమ వ్యవహారం నడిపాడన్న విషయం అర్థం కావడం లేదా?

ఇక అత్తారింటికి దారేది వెనుక చాలా పెద్ద కాన్‌స్పిరసీ ఉంది. ఆ వ్యక్తులు ఎవరో కూడా నాకు తెలుసు…..త్వరలో వాళ్ళ పేర్లు బయటపెడతా అని భారీ స్టేట్‌మెంట్స్ ఇచ్చాడు పవన్. మరి ఇప్పటివరకూ వాళ్ళ పేర్లు బయటపెట్టలేదే. కనీసం కేసులు కూడా పెట్టలేదే. పెట్టలేడు కూడా…..ఎందుకంటే ఆ లీకేజ్ వ్యవహారం నడిపింది ఆ సినిమాకు ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన ఒక మామూలు ఎంప్లాయి కాబట్టి. తనేదో తన ఫ్రెండ్స్‌కి ముందే చూపించాలి అన్న ఉత్సాహంతో పెన్ డ్రైవ్‌లోకి తీసుకున్నాడు. అది కాస్తా ఒకరికొకళ్ళు చాలా మందికి షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత యూట్యూబ్‌లో. నెట్‌లో సోషల్ మీడియా గ్రూప్స్‌లో సర్క్యులేట్ చేయడంతో ఇష్యూ అయింది. ఇక ఈ వ్యవహారంలో కుట్ర ఎక్కడ? అయినా హిట్ అవుతుందో…..ఫ్లాప్ అవుతుందో కూడా తెలియని సినిమాను లీక్ చేస్తే పవన్‌కి నష్టం ఎలా అవుతుంది? పవన్ ఏమైనా ఆ సినిమాకు ప్రొడ్యూసరా? ఇక లీకేజ్ వ్యవహారం టైంలో కూడా అత్తారింటికి దారేది ప్రొడ్యూసర్‌కి తన రెమ్యూనరేషన్‌నో……అందులో కొంత భాగాన్నో వాపస్ ఇచ్చాడన్నది పచ్చి అబద్ధం. తోటి స్టార్ నటుడు అయిన ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా రిలీజ్ రేపు అనగా బివిఎస్ఎన్ ప్రసాద్‌ని సినిమా రిలీజ్ ఆపేస్తానని బెదిరించి మరీ తన రెమ్యూనరేషన్‌లో ఇవ్వాల్సిన కొంత భాగాన్ని వసూలు చేసుకున్న ఘనుడు పవన్. ఈ రకంగా డబ్బుల కోసం ఇతర స్టార్ హీరో సినిమా రిలీజ్ ఆపేస్తానన్న హీరో తెలుగులో మరొకరు కనపడరు. అప్పట్లో లోకేష్ కోసం ఎన్టీఆర్‌ని అణచే ప్రయత్నంలో ఉన్న చంద్రబాబుకు సాయం చేయడం కోసం ఈ కుట్ర వ్యవహారాన్ని నడిపాడు పవన్.

ఇక ఇప్పుడు అజ్ఙాతవాసి సినిమా కూడా ఎవరో టార్గెట్ చేస్తే ఫ్లాప్ అయింది అన్నట్టుగా ప్రచారానికి తెరలేపారు. అజ్ఙాతవాసి సినిమా గోదావరి జిల్లాల్లో ఉండే పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కి కూడా నచ్చలేదు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ….ఆడా మగా కానట్టుగా చేసిన కామెడీ అయితే వాళ్ళకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. త్రివిక్రమ్‌ని పచ్చి బూతులు తిడుతున్నారు. హార్డ్ కోర్ ఫ్యాన్సే అలా ఫీలయితే ఇక మామూలు జనాలకు సినిమా నచ్చే అవకాశం అసలు ఉంటుందా? అందుకే తెలుగు ఇండస్ట్రీ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయినా కుట్రలు చేస్తే ……చెడుగా ప్రచారం చేస్తే సినిమాలు ఫ్లాప్ అవుతాయా? ఇక అజ్ఙాతవాసి సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి ప్రొడ్యూసర్‌కి పవన్ రెమ్యూనరేషన్‌లో కొంత భాగాన్ని తిరిగిచ్చాడన్నది పచ్చి అబద్ధం. డబ్బు విషయంలో పవన్ చాలా పర్టిక్యులర్….ఒక్క రూపాయి కూడా తిరిగి ఇచ్చే అవకాశమే లేదన్నది నిజం. తాను ప్రొడ్యూసర్‌గా(పేరు మాత్రమే శరత్ మరార్‌ది) ఉన్న సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన పవన్ వీరాభిమాని సర్వం నష్టపోయి పవన్‌ని న్యాయం చేయమని కోరుతూ ఫిల్మ్ ఛాంబర్ దగ్గర నిరాహారా దీక్షకు కూర్చుంటే ……తన చుట్టూ ఉన్న మాఫియాతో ఆ పవన్ వీరాభిమాని అయిన డిస్ట్రిబ్యూటర్‌ని ఆదుకోకపోగా……తన చుట్టూ ఉన్న మాఫియా ద్వారా బెదిరించిన చరిత్ర పవన్‌ది. పవన్ చుట్టూ ఉన్న మాఫియా తనను బెదిరించిందని ఆ పవన్ వీరాభిమానే చెప్పాడు. అలాంటి పవన్ డబ్బులు రిటన్ ఇచ్చాడంటే నమ్మాలా?

పూనం కౌర్ విషయంలో కూడా పవన్‌ని సమర్థిస్తూ…….పవన్‌పైన సానుభూతి వచ్చేలా మాట్లాడుతున్న జనాలను చూస్తుంటే మాత్రం జాలేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -