Sunday, April 28, 2024
- Advertisement -

రూ.2 ల‌క్ష‌ల‌కె అమ్ముడు పోతున్న వైసీపీ స‌ర్వేలు….?

- Advertisement -

2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని ఏపీలోని ప్ర‌తిప‌క్ష వైసీపీ అన్ని ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌క్కువ ఓట్ల‌తో అధికారం దూరం చేసుకున్న వైసీపీ ఇప్పుడు అలాంటి వాటికి అవ‌కాశం ఇవ్వ‌కుండా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. అన్న వ‌స్తున్నాడు పేరుతో పాద‌యాత్రను జ‌గ‌న్ చేప‌ట్ట‌బోతున్నారు.

అస‌లు విష‌యానికి వ‌స్తె ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నిక‌ల స‌ర్వేలు ప్రాధాన్య‌త‌ను సంత‌రించ‌కున్నాయి. జాతీయ పార్టీ మొద‌లుకొని ప్రాంతీయ పార్టీ వ‌ర‌కు అన్నీ సొంతంగా ప్ర‌యివేటు సంస్త‌ల‌తో స‌ర్వేలు చేయించ‌కుంటున్నాయి. పార్టీ నుంచి నాయ‌కుల వ్య‌క్తిగ‌తం వ‌ర‌కు ప్ర‌తి ఒక్కురు స‌ర్వే చేయించ‌కుంటున్నారు. ఇది ఇప్ప‌డు ష్యాష‌న్‌గా మారిపోయింది. అయితె అన్ని స‌ర్వేఫ‌లితాలు ఖ‌శ్చితంగా ఉండ‌వు ఒక్కో సారి విరుద్ధంగా వ‌స్తుంటాయి.

అధికారంలోకి రావాల‌ని తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్న వైసీపీ రాష్ట్రంలో పార్టీ ప‌రిస్థితి ఎలాగుంది, ప్ర‌జ‌లు ఏమ‌నుకుంట‌న్నారు, ఎక్క‌డ పార్టీ బ‌లంగా ఉంది,బ‌ల‌హీనంగా ఉంది….వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపొందె నాయ‌కులు ఎవ‌రు అనే స‌మాచారం కోసం  ఒక ప్ర‌యివేటు సర్వే సంస్థకు అధ్యయన బాధ్యతలను అప్ప‌గించారు.

అయితె ఈ సంస్థ ఇన్ ఛార్జ్‌ల‌కు కాకుండా కొత్త‌గా పార్టీ టికెట్ కావాల‌నుకొనె వాల్ల ద‌గ్గ‌ర డ‌బ్బులు తీసుకొని వారికి అనుకూలంగా స‌ర్వేలు ఇస్తున్నారంట‌. దీంతో పార్టీ సీనియ‌ర్‌నేత‌లు ఆవేద‌న చెందుతున్నారు. మొద‌ట మూడువందల శాంపిల్స్ తీస్తున్నామని పార్టీకి చెప్పి.. వంద నుంచి రెండు వందల శాంపిల్స్ తీసుకుని.. మిగతావాటి కోసం లోకల్ గా ఉండేవాళ్ల ఫోన్ నంబర్లు వేస్తున్నారని, వారికి కావాల్సిన వాళ్లకు అనుకూలంగా ఈ సంస్థ సర్వేలు చేస్తోందని ప్రచారం జరుగుతోంది.

ఇప్ప‌టికె కొన్ని జిల్లాల్లో ఇలాంటి వ్య‌వ‌హార‌మే జ‌రిగింద‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి. ఎన్నిక‌ల్లో రిగ్గింగ్ జ‌రుగుతున్న‌ట్లు స‌ర్వేలోకూడా రిగ్గింగ్‌లు జ‌ర‌గ‌డం మొద‌ల‌య్యింది. రూ.2 ల‌క్ష‌లు తీసుకొని టికెట్ కావాల‌నుకొనె వారికి స‌ర్వే ఫ‌లితాలు అనుకూలంగా ఇస్తున్నార‌నె వార్త తాజాగా హ‌ల్ చ‌ల్ చేస్తోంది. మ‌రి దీనిపై వైసీపీ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -