తెలుగు సినీ పరిశ్రమలో ఈ మధ్యన ప్రెస్టీజియస్ వెంచర్లకు పెడుతోన్న టైటిల్స్… అభిమానులను కాస్త ఆందోళనకు గురి చేస్తున్నాయి.కొత్తగా అనౌన్స్ చేస్తోన్న టైటిల్స్ ప్రేక్షకులను ఇబ్బంది పెడుతున్నాయి.
తాజాగా అఖిల్ డెబ్యూ చిత్రానికి బాలరాజు టైటిల్ పరిశీలిస్తున్నారు.దీంతో ఒక్కసారిగా ట్రెండీ హీరో అనుకున్న అఖిల్ ను బాలరాజు అని ట్రీట్ చేయడానికి నాగ్ ఫ్యాన్స్ సుతారమూ ఇష్టపడటం లేదు.
చెర్రీ,శ్రీనువైట్లల సినిమా టైటిల్ ను ఇపుడు విజేత గా మార్చినట్లు ప్రచారం జరుగుతుంది. మై నేజ్ ఈజ్ రాజు ,బ్రూస్లీ,ఫైటర్ నుంచి ఇపుడు టైటిల్ చిరంజీవి ఒకప్పటి చిత్రం విజేతగా మారడం అభిమానులకు అర్ధం కాకుండా చేస్తోంది.
కమెడియన్ కమ్ హీరో సునీల్ ,దిల్ రాజు కాంబినేషన్లో రూపొందిస్తోన్న సినిమాకు పోయి పోయి భటుడు అని నామకరణం చేయడం ఎవ్వరికీ ఇష్టం లేదు.
అలాగే తారక్ ,సుకుమార్ సినిమా…. నాన్నకు ప్రేమతో కూడా చాలా లైట్ టైటిల్ .దీన్ని కూడా కాస్త
పవర్ ఫుల్ గా మార్చే యోచనలో ఉన్నారట.