Tuesday, May 6, 2025
- Advertisement -

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ తమన్ కి నచ్చలేదు..!

- Advertisement -

ఇటీవలే సుపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు టీజర్ రిలీజ్ అయిండి. ఈ టీజర్ మహేష్ ఫ్యాన్స్ కే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. చాలా కాలం తర్వాత మహేష్ బాబు పూర్తి స్థాయిలో మాస్ రోల్లో కనిపిస్తున్నారు. ఆయన డైలాగ్ డెలవరీ కూడా కొత్తగా ఉంది.

ఇక ఈ సినిమాలో స్పెషల్ అప్పీరియన్స్ కానుంది విజయశాంతి. అయితే ఈ సినిమాలో ప్రేక్షకుల చేత విజిల్ వేయించే అంశాలు చాలానే ఉన్నాయని టీజర్ ద్వారానే తెలిసిపోతుంది. ఇక ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా.. మహేష్ సరసన రష్మీక నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అయితే తాజా టీజర్ లో దేవి అందించిన మ్యూజిక్ కి మహేష్ ఫ్యాన్స్ నిరాశపడ్డారు.

మహర్షి సినిమాతో ఫ్యాన్స్ బాధపెట్టిన దేవిశ్రీ కనీసం సరిలేరు నీకెవ్వరు చిత్రంతోనైనా ఆకట్టుకుంటాడేమో అనుకుంటే.. దారుణంగా నిరాశపరిచాడు. అయితే మహేష్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా సరిలేరు నీకెవ్వరు టీజర్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో హ్యపీగా ఫీల్ అవ్వలేదనుకుంటా.. అందుకే టీజర్ అద్భుతంగా ఉందంటూ.. దర్శకుడు, హీరోని ట్యాగ్ చేసిన తమన్.. మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాత్రం ఎక్కడ మెన్షన్ చేయలేదు. దాంతో దేవి శ్రీ అందించిన మ్యూజిక్ తమన్ కు నచ్చలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైన రంగస్థలం తర్వాత ఆ స్థాయి మ్యూజిక్ దేవి నుంచి రాలేదని చెప్పవచ్చు.

Thaman about Sarileru Neekevvaru Teaser

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -