SSMB28 : మహేశ్ కు మరో ” పోకిరి ” పక్కా !

సూపర్ స్టార్ మహేశ్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ నుంచి అధిరిపోయే గుడ్ న్యూస్ వినిపించారు చిత్రా యూనిట్. ఈ మూవీని 2023 ఏప్రెల్ 28 న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. గత కొంత కాలంగా ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో మహేశ్ బాబు అభిమానులు ఎంతో అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. కనీసం మహేశ్ బాబు బర్త్ డే కు కూడా మూవీ కి సంబంధించిన అప్డేట్ ఇవ్వకపోవడంతో అభిమానులు సోషల్ మీడియాలో చిత్రయూనిట్ పై సెటైర్ల వర్షం కురిపించారు.

కానీ అప్పుడు సైలెంట్ గా ఉన్న చిత్రబృందం ఊహించని రీతిలో ఈరోజు అప్డేట్ ఇవ్వడంతో ఫుల్ హ్యాపీ అవుతున్నారు. ఇక SSMB28 రిలీజ్ డేట్(#SSMB28From28April) కు ఉన్న మరో స్పెషల్ ను సూపర్ స్టార్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే గతంలో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన మహేశ్ బాబు క్లాసిక్ మూవీ ” పోకిరి ” ఏప్రెల్ 28 ననే రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. దాంతో ” SSMB 28 ” కూడా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడం పక్కా అని అభిమానులు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.

ఇక ఈ మహేశ్ ను ఊర మాస్ గా చూపించబోతున్నట్లు చిత్రా బృందం అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. దీంతో మహేశ్ నుంచి వచ్చే మాస్ ట్రీట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గతంలో మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా మూవీలు తెలివిజన్ రంగంలో కల్ట్ క్లాసిక్ మూవీస్ గా నిలిచాయి. మరి వీరిద్దరి హ్యాట్రిక్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Also Read: బాలీవుడ్ పై “లైగర్ ” పంజా !

Related Articles

Most Populer

Recent Posts