Sunday, April 28, 2024
- Advertisement -

మరోసారి గట్టి పోటికి పవర్ స్టార్!

- Advertisement -

ఈ ఏడాది బాహుబలి తరువాత బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచే అన్ని చాన్స్‌లు ఉన్న సినిమా ఏదైన ఉంది అంటే అది ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ చిత్రం మొదటి రోజే హిస్టారికల్ 21.40 కోట్ల వసులు చేసి దుమ్ము లేపింది. ఈ చిత్రం ప్లాప్ టాక్ తోనూ 53 కోట్ల షేర్ వసూల్ చేసింది.

ప్లాప్ టాక్ కాకుండా హిట్ టాక్ సొంతం చేసుకొని ఉంటే ఈ చిత్రం ఖచ్చితంగా 100 కోట్లు కొల్లగొట్టేదని ఇజీగా చెప్పొచ్చు. ప్లాప్ రావడంతో ఆ చాన్స్ పవన్ మిస్ చేసుకున్నాడు. అయితే పవన్ ఈ ఏడాది తను చేయబోతున్న కొత్త సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఎస్.జే.సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఈ ఇయర్ లోనే  రిలీజ్ చేసే చాన్స్ లు ఎక్కవగా ఉన్నాయట.

ప్రస్తుతం ఈ చిత్రాన్నికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయనున్నారు. ఇది కంప్లీట్ అవ్వగానే నాన్ స్టాప్ గా షూటింగ్ జరపనున్నారు. 60 వర్కింగ్ డేస్ లో ఈ చిత్రాన్ని పూర్తి చేసి దీపావళికి లేదా డిసెంబర్ లో అయినా సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదే సమయంలో రిలీజ్ కు రెడి అవుతున్న జనతాగ్యారేజ్-ధృవ లాంటి సినిమాలు ఎంత కలెక్ట్ చేసినా టాప్ ప్లేస్ కి పవన్ కళ్యాణ్ కూడా గట్టి పోటి ఇచ్చే చాన్స్ కనబడుతుందని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -