Sunday, May 12, 2024
- Advertisement -

నిజం ఆ… హాస్య నటుడు దొంగ…!

- Advertisement -

అతన్ని చూస్తేనే జనాలు నవ్వుతారు.. అతని నడక – హావా భావాలు – మాటలు. డ్రెస్ సెన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని హాస్యాన్ని పండిస్తాయి.. అతను సెట్‌లో ఎంత చెబితే అంతా… అతను లేకుండా సినిమాని చూడటం కొంచెం కష్టమే… అతని కోసం పెద్ద దర్శకులు పెద్ద హీరోలు కూడా సినిమాల Shooting ఆపిన సందర్భాలు ఉన్నాయి..

ఆయన డేట్స్ అంత సులువుగా దొరకవు మరి…  ఇక అంత బిజీగా ఉండే ఆ కమెడియన్‌కి రెమ్యూనరేషన్ ఏమైన తక్కువ అంటే అస్సలు కాదు.. రోజుకి లక్షల చొప్పునే ఉంటుంది.. ఇది అంత బాగానే ఉంది.. కాని ఆయనకి ఒక జబ్బు ఉంది.. అదే ఆయనకి పెద్ద మైనస్… ఏంటంటే… ఇన్ డోర్ అయినా outdoor అయినా దేశం అయినా విదేశం అయినా shooting ఎక్కడైనా కావొచ్చు… తను shooting చేసే place ముఖ్యం కాదు.. అతనికి హీరో కూడా ముఖ్యం కాదు… కేవలం అక్కడ తనకి నచ్చిన వస్తువులు ఏమున్నాయా అనే చూస్తాడట…. చ.. నిజమా.. అని అంటే నిజమే.. తెలుగు అక్షరాలంత అందమైన నిజం… ఆ వస్తువు తనకి నచ్చితే చాలు గుట్టు చప్పుడు కాకుండా తన బ్యాగ్‌లో వేసుకుంటాడట… ఆయన రేంజ్‌కి ఈయన చేసే పనికి అస్సలు సంబంధం ఉండదు.. 

ఇకపోతే ఆయన తీసుకెళ్ళే వస్తువులు పెద్దవా అంటే అది కూడా కాదు.. చిన్నవే… కానీ అవి ఆయనకి నచ్చాలి… ఆయన bagలో పట్టాలి… దీనికి ఆధారాలు ఏంటీ అంటే ఒక సారి న్యూజ్‌ల్యాండ్‌లో shooting పెద్ద స్టార్ హీరో, అందాల భామ హీరోయిన్ ఇతని మధ్యే సన్నివేశాలు ఉన్నాయి.. అక్కడ shooting అంటే ఏదో పెద్ద hotel తీసుకోవాలి కదా…  తీసుకున్నారు… shooting చేస్తున్నారు.. అక్కడ రోజుకి ఒక వస్తువు మాయమవుతున్నాయి… అక్కడ hotel సిబ్బందికి ఏం అర్థం కావట్లేదు.. అలా 13 రోజులు shooting జరిగింది… షెడ్యూల్ పూర్తి అయ్యింది.. hotel ఖాళీ చేసి వస్తున్నారు… ఇక్కడ మన దగ్గర అయితే.. పెద్ద స్టార్, పెద్ద కమెడియన్, పెద్ద హీరోయిన్.. కాని న్యూజ్‌ల్యాండ్‌లో అయితే కాదు కదా.. మనం bag లు చెక్‌ చేయం వాళ్ళు చేస్తారు… అది తేడా… హీరోగారు one hour ముందే check out అయి వెళ్ళారు airport కి…  హీరోయిన్ డైరెక్టర్ కూడా 20 minutes.. అయ్యింది వెళ్ళి.. ఇక మిగిలింది మన కమెడియనే…  

ఎక్స్‌క్యూజ్‌మి సార్.. we wanna check your bag అన్నారు… మన కమెడియన్ ప్రాణాలు పాలకొల్లుకి.. ఊపిరి ఉయ్యూరికి, ఆయువు అమలాపురం వెళ్ళాయి. చెమటలు వచ్చాయి.. అయినా తప్పదు bag ఇచ్చాడట… ఎందుకంటే అది ఇండియా కాదు కదా… what nonsense move are talking… అని అనటానికి… బ్యాగ్ open చేసారు.. మన వాడి గుట్టు బట్ట బయలు అయింది… ఇక hotel సిబ్బందికి.. కరెంట్ అంత కోపం వచ్చింది.. ఇంతకీ అందులో ఏమున్నాయో తెలుసా.. (స్పూన్స్,స్పోర్క్‌లు) ఆ సిబ్బందితో మనోడికి ఇబ్బంది కలిగింది.. తీసి లోపలేయండి.. call the police అన్నాడు… ఇక మనోడు చేసేదీ ఏమీ లేక కాళ్ళ బేరానికి వచ్చాడు.. ఎన్ని చెప్పినా వినలేదు..

 చివరికి మన స్టార్ హీరో గారికి call వెళ్ళింది అతను విని షాక్‌ అయ్యి షార్ట్ టైమ్‌లో వచ్చాడు. తెలుగు సినిమాలో అతని ఫేస్ ఎలా ఉన్నా మనం నవ్వుకుంటాం… అలాగే హాస్యాన్ని ఎక్కువగా ఇష్టపడే ఆ స్టార్ హీరో కూడా మన కమెడియన్‌ ఫేస్ చూసి పగలబడి నవ్వుకున్నాడట.. ఇతని నవ్వు చుసి కమెడియన్ కూడా నవ్వాడట… అక్కడ ఆ hotel వాళ్ళకి ఏమీ అర్థం కాలేదట… what happened.. why are you laughing అని.. అనే సరికి మన స్టార్… మొదట నవ్విన నవ్వు original.. ఇప్పుడు నవ్వే నవ్వు… అరువు తెచ్చుకుంది… ఏదో మేనేజ్ చెయ్‌రా నీ యయ్యా… అని తెలుగులో అని మన స్టార్ ఆ సీన్ ని ఎలాగోల మేనేజ్ చేశాడట.. ఇదంతా మేమ్ అనుకున్న plan.. అందుకే ఇలా చేశాం.. ఏదో just for jock… ఇతను మా తెలుగులో పెద్ద కమెడియన్ అని..వాళ్ళని మేనేజ్ చేయలేక.. మన హీరో ఒక హిట్టు సినిమాకి పడాల్సిన శ్రమ పడ్డాడట… చివరికి వాళ్ళు నమ్మి.. నవ్వుకున్నారట… ఎందుకంటే ఎంతైనా కామెడీకి భాష, భేదాలు ఉండవు కదా… వాళ్ళు వీళ్ళని వదిలేశారు…

 బయటికొచ్చాక మన స్టార్ ఆ కమెడియన్ ని తెలుగులో తన కడుపులో దాచుకున్న తిట్లన్ని తిట్టాడట… ఏదో సార్ ఇది నాకొక weakness లాగా మారింది… మార్చుకోలేక పోతున్నా… please try to understand me… అని అనగానే అప్పుడు కుడా మళ్ళీ మన స్టార్ ఆ ఫేస్‌ని చూసి… నవ్వు ఆపుకోలేక పోయాడట… ఈ విషయం ఈ నోటా ఆ నోటా తెలుగులో తెలిసింది… ఇక అప్పటి నుండి ఈ కమెడియన్ సెట్‌కి వస్తే చాలు సెట్ ప్రాపర్టీ బాయ్స్‌ని..  ప్రత్యేకంగా ఇద్దరిని పెడతారట… ఇంత పేరు వచ్చినా.. ఆ కమెడియన్…  తన పాత అలవాటుని మార్చుకున్నాడో లేదో…..  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -