Tuesday, May 21, 2024
- Advertisement -

ఆటగాళ్లకు వందల కోట్లతో ఎర.. ప్రపంచక్రికెట్ లో చీలిక..?!

- Advertisement -

క్రికెట్ డబ్బును శాసించడం లేదు.. డబ్బు క్రికెట్ ను శాసించడం మొదలు పెట్టిచాలా కాలం అయ్యింది. మరి క్రికెట్ కు అలా డబ్బు జబ్బు సోకింది.. ఇది ఇంకా ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది?

అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విషయం ఏమిటంటే.. జీ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర మళ్లీ నిద్ర లేచారు! ఈయన త్వరలోనే మరో లీగ్ తో జనాల ముందుకు వస్తున్నారు. ఇది వరకూ ఇండియన్ క్రికెట్ లీగ్(ఐసీఎల్) తో సంచలనం సృష్టించిన సుభాష్ చంద్ర ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ పై ప్రభావం చూపడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.

ఆయన ఇప్పుడు ప్రపంచ క్రికెట్ లోనే చీలిక తీసుకు వచ్చేందుకు.. ఐసీసీకి సమాంతరంగా మరో క్రికెట్ వ్యవస్థను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఐసీసీకి పోటీగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి..డబ్బుతో క్రికెట్ బోర్డులను, క్రికెటర్లతను అటువైపు మళ్లించాలని ఆయన భావిస్తున్నారట.

ఇప్పటి వరకూ అయితే తెరవెను ఈ ప్రయత్నాలు ఊపందుకొన్నాయని సమాచారం. ఒక్కో క్రికెటర్ కూ వందల కోట్ల రూపాయలు పడేసి అయినా.. సమాంతర వ్యవస్థను నెలకొల్పాలని ఎస్సెల్ గ్రూప్ అధినేత భావిస్తున్నాడని టాక్ . దీని వెనుక ఐపీఎల్ ఫస్ట్ బాస్ లలిత్ మోడీ హస్తం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. 

వీరు ఏర్పరిచే వ్యవస్థలో క్రికెటర్లను ఆకర్షించడానికి వందల కోట్ల రూపాయలను వెదజల్లనున్నారని మసాచారం.స్టార్ ఆటగాళ్లకు మూడునాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చి అయినా ఈ లీగ్ వైపు లాగుతారట! మరి మొత్తంగా ఈ ఆలోచనలు అయితే సంచలనాత్మకంగానే ఉన్నాయి. ఇవి ఏ మేరకు విజయంతం అవుతాయో చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -