Tuesday, May 21, 2024
- Advertisement -

నారా లోకేష్ తన స్థాయి ఏంటో చూపించబోతున్నాడు!

- Advertisement -

ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన తనయుడి భవిష్యత్తు కోసం బాటలు వేసే పనిలో పడ్డాడు.

పార్టీ లోకేష్ కు పట్టుదక్కేలా చేయడానికి.. తెలుగుదేశం పార్టీకి లోకేష్ బాబే భవిష్యత్తు సారధి అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి.. ఇదే అదును అని బాబు భావించాడు. తన టర్మ్ పూర్తి అయ్యే సరికి లోకేషే ఏపీ ముఖ్యమంత్రి పదవికి అర్హుడు.. అని అనిపించాలనేది బాబు మాస్టర్ ప్లాన్.

ఈ నేపథ్యంలో లోకేష్ ఇప్పటికే పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకొంటున్నాడు. సెక్రటేరియట్ లో తన మనుషులను నియమింపజేసుకొన్నాడు. ప్రతి మంత్రిదగ్గరా తన షాడో ఒకడిని పెట్టి.. సచివాలయంలో ఎప్పుడు ఏం జరుగుతోంది? అనే విషయాల గురించి లోకేష్ తెలుసుకొంటున్నాడు. ఇలా ప్రభుత్వ, పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకొంటున్న లోకేష్ ఇప్పుడు అమెరికా పర్యటనకు కూడా బయలు దేరారు.

అదేంటి అంటే.. పెట్టుబడులు తీసుకురావడానికి అంటున్నాడు. మరి  ఎలాంటి అధికారిక హోదాలేని లోకేష్ బాబు ప్రభుత్వ అధికారులను వెంటేసుకొని విదేశాలకు ఎలా వెళతారో అర్థం కాదు. మరి ఏపీలో ఉన్నది ప్రజాస్వామ్యమా.. లేక చంద్రబాబు రాజరికమా.. అనేది సులభంగా అర్థమయ్యే వ్యవహారం కాదు.

ఇదిలా ఉంటే.. లోకేష్ బాబు అమెరికా అధ్యక్షుడు ఒబామాతో కూడా సమావేశం కానున్నాడనే గ్యాసిప్ ఒకదాన్ని వదిలారు. పోర్ట్ ల్యాండ్ ఆర్గాన్ లో జరిగే ఒక కార్యక్రమానికి ఒబామా హజరవుతాడని.. అక్కడ లోకేష్ బాబు ఒబామాతో మీట్ అవుతాడని తెలుగుదేశం అనుకూల మీడియా చెబుతోంది. మరి ఇందులో నిజానిజాలు ఒబామాకు, లోకేష్ కే తెలియాలి. మొత్తానికి  లోకేష్ బాబు అప్పుడే ఒబామా స్థాయికి ఎదిగాడు అనమాట!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -