పవన్ కళ్యాణ్ కి ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయనను ఒక నటుడిగా కంటే వ్యక్తగంగా ఎక్కువ మంది అభిమానులను సంపాధించుకున్నాడు. ఏ హీరో ఫ్యాన్స్ అయినా.. పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా అభిమానిస్తారు. ఇక పవన్ కూడా ఎవర్ని విమర్శించకుండా.. పది మందికి సహయం చేస్తూ.. తన పని ఏదో తాను చేసుకుపోతాడు.
ఇక ఇటివలే ఎన్టీఆర్ మూవీ ప్రారంబోత్సవానికి పవన్ వెళ్లడం.. టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయంశమయింది. ఒక స్టార్ హీరో ఫంక్షన్ కి మరో స్టార్ హీరో హాజర్ కావడం చాలా అరుదుగా జరుగుతోంది. అలానే పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు ఓ ఆసక్తికరమైన విషయం టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. అదేంటంటే.. ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న మూవీ కథను పవన్ తోనే తీయాలని తివిక్రమ్ అనుకున్నాడట. వెంటనే ఆ కథను పవన్ కు వినిపించాడట. పవన్ కు కూడా కథ బాగా నచ్చేసిందట.
కానీ ఆ కథకు తాను సూట్ కానని.. ఎన్టీఆర్ అయితే బాగా సూట్ అవుతారని పవన్ సలహా ఇచ్చాడట. ఆయన సలహా ఇవ్వడంతో త్రివిక్రమ్.. ఎన్టీఆర్ కు కథ వినిపించడం.. కథ విని ఎన్టీఆర్ వెంటనే ఓకే చేయడం జరిగిందట. ఒక స్టార్ హీరో.. మరో స్టార్ హీరో కోసం సినిమాని ఒదులుకోవడం గొప్ప విషయం అని పవన్ ని పొగిడేస్తున్నారు.
