Monday, May 13, 2024
- Advertisement -

రేపు అమరావతిలో మరోసారి చంద్రబాబుతో రేవంత్‌ భేటీ…

- Advertisement -

తెలంగాణా టీడీపీ నేత రేవంత్ రెడ్డి క‌థ‌క్లైమార్స్‌కు చేరింది. గ‌త కొద్దిరోజులుగా రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నార‌నె వార్త‌ల‌పై పార్టీలో తీవ్ర గంద‌ర‌గోలం నెల‌కొంది. ఈగంద‌ర‌గోలానికి పుల్‌స్టాప్ పెట్టేందుకు బాబు పార్టీ నేత‌ల‌తో స‌మావేశ మ‌య్యారు.

పార్టీలో నేతల మధ్య జరుగుతన్న ఆరోపణ, ప్రత్యారోపణల పర్వానికి తెరతీయాలన్న ఉద్దేశంతో తన తొమ్మిది రోజుల విదేశీ పర్యటనను ముగించుకు రాగానే రంగంలోకి దిగిన చంద్రబాబు, నేతలతో కీలక సమావేశాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, పార్టీ ఇతర నేతలు నామా నాగేశ్వరరావు, పెద్దిరెడ్డి, మోత్కుపల్లి నరసింహులు, ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి, సీతక్క, అరవింద్ కుమార్ గౌడ్ తదితరులతో పాటు మొత్తం వివాదానికీ కేంద్ర బిందువైన రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన నాటి నుంచి జరిగిన పరిణామాలను ఎల్ రమణ వివరించినట్టు తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లనున్నారని, వెళ్లే ముందు ఇంతకాలం అన్నంపెట్టిన పార్టీపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని కాస్తంత కటువుగానే వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఎల్ రమణ చేస్తున్న ఆరోపణలను రేవంత్ అడ్డుకోబోగా, చంద్రబాబు కల్పించుకుని తనకన్నీ తెలుసునని ఒకింత ఆగ్రహంగా అన్నట్టు పార్టీ వర్గాల సమాచారం.

రేవంత్ మీతో కొద్దిసేపు విడిగా మాట్లాడాలి” అని అనగా, అటువంటి అవసరం లేదని చంద్రబాబు తేల్చి చెప్పినట్టు సమాచారం. విడిగా ఎవరితోనూ సమావేశాలు అయ్యేది లేదని చంద్రబాబు స్పష్టం చేయడంతో ఇక చేసేదేమీ లేక, మిగతావారితో పాటే ఈ సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు.

అయితె త‌ర్వాత బాబుతో రేవంత్ కొద్దిసేపు ఏకాంతంగా మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలను వివరించినట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణ టీడీపీ నేతలతో పాటు రేవంత్‌ రెడ్డి రేపు (శనివారం) అమరావతిలో చంద్రబాబుతో మరోసారి సమావేశం కానున్నారు. అంతకు ముందు రేవంత్‌తో పాటు ఎల్‌.రమణ పరస్పరం అధ్యక్షుడికి ఫిర్యాదు చేసుకున్నట్లు సమాచారం. పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం ముగియగా, ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -