Thursday, April 18, 2024
- Advertisement -

తెలుగు డైరెక్టర్ డైవోర్స్ వ్యవహారం……. ఆ హీరోయిన్ కారణమా?

- Advertisement -

సెన్సిబుల్ డైరెక్టర్, ఆలోచనా స్థాయిని పెంచే సినిమాలు తీశాడు. విలువలు నేర్పించాడు. అయితే ఆ డైరెక్టర్ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆ విలువలు లేవా? అందుకే కేవలం రెండేళ్ళకే పెళ్ళి పెటాకులు అయ్యే పరిస్థితి వచ్చిందా? ఇప్పుడు ఈ విషయాలే టాలీవుడ్‌లో చర్చనీయాంశం అవుతున్నాయి. కల్ట్ క్లాసిక్‌గా పేరు తెచ్చుకున్న సదరు డైరెక్టర్ మెగా హీరోతో తీసిన ఒక వార్ బ్యాక్ డ్రాప్ ఫిల్మ్‌లో ఆ హీరోయిన్ యాక్ట్ చేసింది. ఆ తర్వాత నుంచీ కూడా ఇద్దరి మధ్యా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఆ సినిమా షూటింగ్ టైంలో కూడా కొన్నాళ్ళు ఆ హీరోయిన్ స్టార్ హోటల్‌లో ఉనిందట. అయితే ఆ తర్వాత డైరెక్టర్‌తో క్లోజ్ అయ్యాక హోటల్ ఖాళీ చేసి డైరెక్ట్‌గా సదరు డైరెక్టర్ ఇంట్లోనే మకాం వేసిందని తెలుస్తోంది. ఆ డైరెక్టర్ కూడా ఆ హీరోయిన్‌తో సంబంధాన్ని దాచే ప్రయత్నం కూడా ఎప్పుడూ చేయలేదట. ఇక ఆ హీరోయిన్ కూడా ఆ డైరెక్టర్ తీసిన సినిమాలో సంప్రదాయంగా కనిపించినప్పటికీ లైఫ్ స్టైల్ అంతా అల్ట్రా మోడరన్ స్టైల్ అని చెప్పుకుంటున్నారు. అన్నింటికీ మించి సూపర్ హాట్ హీరోయిన్ అన్న ఇమేజ్ కోసం ఆ హీరోయిన్ ప్రయత్నాలు చేస్తోంది. అలాగే ఆ హీరోయిన్‌కి అలాంటి అవకాశాలు ఇప్పించడం కోసం ఆ డైరెక్టరే హెల్ప్ చేస్తున్నాడట. ఈ వ్యవహారాలన్నింటితో విసిగిపోయిన ఆ డైరెక్టర్ భార్య విడాకులకు అప్లై చేసిందని ఆ డైరెక్టర్ సన్నిహితులు చెప్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -