Sunday, April 28, 2024
- Advertisement -

తెలుగు సినిమా అగ్రహీరోకు శ్రీదేవి అంటే కోపం ఎందుకు? చనిపోయాక కూడా విమర్శలా?

- Advertisement -

తెలుగు సినిమా ప్రేక్షకులను కొన్ని దశాబ్ధాలపాటు అలరించిన శ్రీదేవి….ఆ తర్వాత జాతీయ స్థాయికి ఎదిగింది. దేశంలో ఉన్న చాలా భాషల్లోనూ…జాతీయ స్థాయిలోనూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. శ్రీదేవి అంతిమయాత్రకు వచ్చిన జనసంఖ్యను చూసి జాతీయ మీడియా కూడా ఆశ్ఛర్యపోయింది. తెలుగులో ఉన్న సీనియర్ హీరోలు, జూనియర్ హీరోలు అందరితో నటించిన….. అందరు హీరోలకు హిట్స్ ఇచ్చిన శ్రీదేవిపై ఒక తెలుగు ప్రముఖ హీరో మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

ఇతర హీరోలు ముంబై వెళ్ళి మరీ శ్రీదేవి అంతిమయాత్రలో పాల్గొంటే ఆ హీరో మాత్రం ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశాడట. వారసత్వంతో హీరో అయిన అతగాడికి మొదటి నుంచీ కూడా శ్రీదేవితో సఖ్యత లేదు. ఈ మధ్య కాలంలో కొంతమంది హీరోయిన్స్ ఆ హీరో వ్యక్తిత్వం…….ఆ హీరో పెట్టిన టార్చర్‌పై మీడియాతో రకరకాలుగా చెప్పారు. ఇండస్ట్రీలో కూడా హీరోయిన్స్‌తో ఆ హీరో ఉండే విధానం గురించి చాలా కథలే వినిపిస్తూ ఉంటాయి. ఆడియో రిలీజ్ ఫంక్షన్స్‌లో కూడా కాస్త దిగువస్థాయి భాషలోనే మాట్లాడేస్తూ ఉంటాడు ఆ హీరో. ఇప్పుడు అదే హీరో చనిపోయిన శ్రీదేవిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడట. ఆ విషయంలో ఆ వంశంతో సన్నిహితంగా ఉండే కొంతమంది పెద్దలు కూడా ఆ హీరోకి సుద్దులు చెప్పారని తెలుస్తోంది. బాలీవుడ్‌తో కూడా బిజినెస్ పరమైన అవసరాలు తెలుగు ఇండస్ట్రీకి చాలా ఉన్నాయని…..బాలీవుడ్‌లో అగ్రస్థాయి వంశాల్లో ఒకటైన కపూర్ల ఇంటి కోడలి గురించి అనుచితంగా మాట్లాడితే ముందు ముందు ఇబ్బందులు వస్తాయని చెప్పారట. నలుగురి మధ్యలో ఉన్నప్పుడు ఎలాంటి అనుచిత వ్యాఖ్యలూ చెయ్యొద్దని చెప్పారట. అయితే అసలు శ్రీదేవితో ఆ హీరోకి ఉన్న సమస్య ఏంటి అని మాత్రం ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా మంది చర్చించుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -