Thursday, May 2, 2024
- Advertisement -

హోదాపై బాబు చిత్తశుద్ధి ఇది…… తాను చేయడు….. జగన్‌ని చెయ్యనివ్వడు

- Advertisement -

అధికారమే పరమావధిగా రాజకీయాలు చేయడంలో చంద్రబాబు తర్వాతే ఎవ్వరైనా. ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి రావాలన్న ఉద్ధేశ్యంతో హోదా పదిహేనేళ్ళు తెస్తా అన్నాడు. అధికారంలోకి వచ్చాక రాష్ట్రాభివృద్ధికి దోహదపడే ప్రత్యేక హోదాకు మంగళం పాడేసి పచ్చ చొక్కాలు నింపడానికి ఉపయోగపడే ప్యాకేజ్ కావాలన్నాడు. హోదా స్థానంలో ప్యాకేజ్ ఇచ్చేలా తన సన్నిహితుడైన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ఒప్పించాడు. పక్క రాష్ట్రాలు ఇవ్వొద్దని ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశాన్ని ఎలా డైవర్ట్ చెయ్యాలా అని ఆలోచిస్తున్న మోడీ……ఇదే ఛాన్స్ అని చెప్పి జైట్లీచేతనే ప్యాకేజ్‌కి జైకొట్టించాడు. ఎక్కడ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందో అని జైట్లీ ప్యాకేజ్‌లో ఏం ఉందో కూడా తెలుసుకోకుండా అప్పటికప్పుడు ప్యాకేజ్‌కి జై కొట్టాడు చంద్రబాబు. ఆ రకంగా ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను అడ్డంగా ముంచేశాడు.

మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన చివరి బడ్జెట్‌లో కూడా ఎపికి చిప్ప చూపించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఆ ఆవేశానికి భయపడి……..ప్రజల ఆగ్రహం తనపైకి మళ్ళుతుందేమో అని భయపడి మళ్ళీ హోదాకి జై అన్నాడు. జగన్ ఎంపిలు రాజీనామాలు చేయాలన్నాడు. ఢిల్లీలో ధర్నా చేయాలన్నాడు. అధికారంలో ఉన్న చంద్రబాబు ఏమీ చేయకపోయినప్పటికీ జగన్ మాత్రం ధైర్యంగా ముందుకొచ్చాడు. బాబు భజన సేనుడు పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ విసరడంతో అవిశ్వాస తీర్మానానికి కూడా ఒప్పుకున్నాడు.

మరి చంద్రబాబు ఏం చేస్తున్నట్టు? ఏముంది? హోదా కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ చేపట్టిన ఆందోళనలు, ధర్నాలను అణిచే పనిలో ఉన్నాడు. ఎపి ప్రయోజనాల కోసం అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తాం అనో…అవిశ్వాస తీర్మానం మేమే పెడతాం అనో చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. రాజీనామాలు, అవిశ్వాస తీర్మానం వేస్ట్ అని మాత్రం ముందే అంటాడు. మరి ఇంకేం చేస్తే ప్రత్యేక హోదా వస్తుంది? రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ప్రయోజనాలు దక్కుతాయి అంటే సమాధానం ఉండదు.

ఇప్పుడు కూడా చంద్రబాబు అదే చేస్తున్నాడు. హోదా కోసం పోరాడుతున్న వైకాపా శ్రేణులను అరెస్టులు చేయిస్తున్నాడు. జగన్ పార్టీ ధర్నాలు ఫ్లాప్ …..ప్రత్యేక హోదా పోరుకు ప్రజల నుంచి స్పందన లేదు అని తన భజన మీడియా చేత ప్రచారం చేయిస్తున్నాడు. హోదా కోసం జగన్ పోరాటం చేస్తున్న నేపథ్యంలో….ప్రజలు కూడా ఎక్కడ భారీ స్థాయిలో సపోర్ట్ చేస్తారో అని హోదా వేస్ట్ అన్న పాట మరోసారి అందుకున్నాడు. అధికారంలో ఉన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పోరాటం చేయడు……చేస్తానన్న జగన్‌ని చెయ్యనివ్వడు. పవన్, జెపిలాంటి బాబు జేబులో బొమ్మలు ఇదెక్కడి అన్యాయం అని బాబుని ప్రశ్నించరు. ఇలాంటి పచ్చ బ్యాచ్ నాటకాలతోనే నాలుగేళ్ళుగా ఆంధ్రప్రదేశ్‌కి చిప్పే దక్కేలా దిగ్విజయంగా చేశారు చంద్రబాబు. ఇప్పుడు చివరి సంవత్సరంలో కూడా సేం టు సేం అవే డ్రామాలు. 2019ఎన్నికల్లో చంద్రబాబు డ్రామా పోరాటాలకు ఓట్లేస్తారో…….ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ భారీస్థాయిలో ప్రత్యక్ష పోరాటం చేస్తున్న జగన్‌కి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లేస్తారో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -