Saturday, May 4, 2024
- Advertisement -

బ్రాహ్మణ కులస్తులకి ఆ సినిమా మీద కోపంగా ఉంది , అసలేమైంది ?

- Advertisement -

విలక్షణ సినిమాలు తీయడం లో హీరో ఉపేంద్ర కి సరి సాటి లేదు అనే చెప్పాలి. స్వీయ దర్సకత్వం లో అతను చేసిన ఏ , రా , ఉపేంద్ర , సూపర్ లాంటి సినిమాలు అతిపెద్ద సంచలనాలు. ఈ మధ్య వచ్చిన ఉపేంద్ర టూ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ కాలేదు. ప్రతీ సినిమా నీ ఎదో ఒక వివాదం తో ముడి పెట్టె అలవాటు ఉన్న హీరో ఉపేంద్ర.

పోయిన సంవత్సరం అతని సినిమా శివం కన్నడం లో భారీ విజయం చేకూర్చింది, ఆ విజయం అకంటే ముందర అతిపెద్ద వివాదానికి దారి తీసింది. ఈ సినిమాకి మొదట ‘బసవణ్ణ’ అనే టైటిల్ పెట్టారు. ఈ టైటిల్ తో పాటు పోస్టర్ల మీద కూడా పెద్ద వివాదం నడిచింది. చివరికి అన్నీ సరిదిద్దుకున్నారు. శివం పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. దాన్నే ఇప్పుడు తెలుగు లో విడుదల చేస్తున్నారు.

దీనికి బ్రాహ్మణ అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారు, అదే పేరు మీద పోస్టర్ లు కూడా విడుదల చేసారు. ఈ టైటిల్ తమని కించ పరుస్తోంది అంటున్నారు బ్రాహ్మణ కులస్తులు. ఇప్పుడు బ్రాహ్మణ అని పేరు పెట్టి ఓ వయొలెంట్ మూవీ వదిలితే ఎలా ఊరుకుంటారు? బహుశా ఇలా వివాదం చెలరేగితే అది పబ్లిసిటీకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఈ టైటిల్ పెట్టారేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ‘దండుపాళ్యం’ ఫేమ్ శ్రీనివాసరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. రాగిణి ద్వివేది కథానాయిక. మరి ఈ టైటిల్ విషయంలో బ్రాహ్మణులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -