Saturday, May 4, 2024
- Advertisement -

నిర్మాతతో పెళ్లి…త్రిష ఫైర్!

- Advertisement -

రీసెంట్‌గా పొన్నియన్ సెల్వన్‌తో బిగ్గెస్ట్ హిట్ కొట్టారు నటి త్రిష. ఇండస్ట్రీలోకి వచ్చిన 21 ఏళ్లయిన ఇంకా పెళ్లి కాలేదు. నాలుగు పదుల వయస్సు వచ్చినా తరగని అందం త్రిష సొంతం…ప్రస్తుతం తెలుగు,తమిళ్,మలయాళ భాషల్లో ఆరు సినిమాలకు పైగా చేస్తుండగా విజయ్‌తో ఆమె నటించిన లియో విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇక త్రిష రీల్ లైఫ్ సంగతి పక్కన పెడితే రియల్‌ లైఫ్‌లో రూమర్స్ ఎప్పటికి హాట్ టాపికే. ఎన్ని ఎఫైర్లు నడిపినా.. వాటిని పెళ్లి దాకా తీసుకు వెళ్లలేకపోయింది త్రిష. అయితే తాజాగా త్రిష పెళ్లి వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. మలయాళ నిర్మాతతో పెళ్లి అంటూ న్యూస్‌ని వైరల్‌ చేశారు. ఆనిర్మాతతో త్రిష ప్రేమలో ఉన్నారని…త్వరలో ఏడడుగులు వేయబోతున్నారని టాక్ నడుస్తోంది. త్రిషతో సినిమా తెరకెక్కిస్తున్న తరుణంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని టాక్ నడుస్తోంది.

దీంతో ఈ రూమర్స్‌కు వెంటనే చెక్ పెట్టింది త్రిష. మీరు మరియు మీ బృందం ఎవరో మీరు తెలుసు…ప్రశాంతంగా ఉండండి అలాగే పుకార్లు ఆపండి అని చెబుతూ చీర్స్‌ అని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. గతంలో ఓ వ్యాపారవేత్తతో త్రిష ఎంగేజ్‌మెంట్ జరిగి తర్వాత క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత సినిమాల్లో బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయారు త్రిష. ఇక ప్రభాస్ నటిస్తున్న సలార్ చిత్రంలో ఐటెం సాంగ్‌లో త్రిష నటిస్తోందని వార్తలు వెలువడుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -