Thursday, May 16, 2024
- Advertisement -

వీడని సస్పెన్స్..బాబు కస్టడీ తీర్పు వాయిదా

- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు ఎపిసోడ్ సస్పెన్స్‌ థ్రిల్లర్‌లా సాగుతోంది. ఓ వైపు బెయిల్ పిటిషన్‌, మరో వైపు కస్టడీ పిటిషన్ థ్రిల్లర్ మూవీని తలపించేలా నరాలు తెగే ఉత్కంఠలా సాగుతోంది.ఇక నిన్న బాబు కస్టడీ పిటిషన్‌పై ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఇవాళ తీర్పునె వెలువరించనుండగా చివరి వరకు సస్పెన్స్ కొనసాగించి తీర్పును రేపటికి వాయిదా వేశారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును విచారించడానికి 5 రోజుల కస్టడీ కోరుతూ సీఐడీ పిటిషణ్ వేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తొలుత సాయంత్రం తీర్పు సాయంత్రం తర్వాత రేపటివకి వాయిదా వేశారు. బాబును కస్టడీకి అప్పగిస్తారని ప్రచారం జరిగిన నేపథ్యంలో కోర్టు దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక తీర్పును రేపటికి వాయిదా వేయడంతో సస్పెన్స్ తిరిగి కంటిన్యూ అవుతోంది.

స్కిల్ డెవలప్‌మెంట్‌ పరుతో అప్పట్లో రూ. 371 కోట్ల మేర స్కామ్ జరిగిందని సీబీఐ వాదిస్తుండగా ఈ కేసులో బాబు ఇన్వాల్వ్‌మెంట్ ఉందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు చంద్రబాబు తరపు న్యాయవాదులు. స్కామ్‌కి సంబంధించి ఇంకా చాలా ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాల్సి ఉందని సీఐడీ తరపు న్యాయవాదులు కోరగా రాజకీయ కక్ష సాధింపు కోసం అడుగుతున్నారని, కస్టడీకి ఇవ్వొద్దని బాబు తరపు న్యాయవాదులు వాదించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -