Sunday, May 19, 2024
- Advertisement -

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కథ కష్టాలు….. ఎన్టీఆర్ అసహనానికి కారణాలు

- Advertisement -

మాటల మాంత్రికుడు అని గొప్పగా చేయించుకున్న ప్రచారం…..మొత్తం తెలుగు సినిమా చరిత్రలోనే బెస్ట్ రైటర్ అనే స్థాయిలో గొప్పలు…..అన్నీ కూడా ఒక్క సినిమా రిజల్ట్‌తో గల్లంతయిపోయాయి. ఏదో ఒక మాయ చేసి, కాపీలు కొట్టి కమర్షియల్ హిట్స్ కొట్టిన డైరెక్టర్స్ అందరి పరిస్థితి ఇప్పుడు ఇలానే ఉంది. తెలుగు సినిమా వివరాలు ఇప్పుడు హాలీవుడ్ నిపుణులకు కూడా సోషల్ మీడియా ద్వారా తెలుస్తున్న నేపథ్యంలో తెలుగు కాపీ డైరెక్టర్స్ అందరూ కూడా అడ్డంగా బుక్కవుతున్నారు.

అజ్ఙాతవాసితో ఆ అనుభవం తెలుసుకున్న త్రివిక్రమ్ ఇప్పుడు తెలుగు నవలలపైన ఆధారపడుతున్నాడు. అయితే అలా వండుతున్న రచన ఎన్టీఆర్‌కి అంతగా నచ్చట్లేదని తెలుస్తోంది. హీరోయిజం విషయంలో ఎన్టీఆర్ స్థాయికి తగ్గట్టుగా రావడంలేదని యూనిట్ మెంబర్స్ అభిప్రాయపడుతున్నారట. అందుకే ఆ హీరోయిజం విషయాన్ని పక్కనపెట్టిన త్రివిక్రమ్….ఎంచక్కా తనకు బాగా అలవాటైన ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన లవ్ స్టోరీగా కథను తీర్చిదిద్దుతున్నాడట. అసలే అజ్ఙాతవాసి డిజాస్టర్‌తో త్రివిక్రమ్‌పై బోలెడన్ని అనుమానాలు క్రియేట్ అవుతున్న నేపథ్యం……అజ్ఙాతవాసితో పాటు రైటర్‌గా, డైరెక్టర్‌గా త్రివిక్రమ్ గతంలో కాపీ కొట్టిన కాపీ చరిత్రపై నెటిజనులు విరుచుకుపడుతున్న నేపథ్యంలో తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి త్రివిక్రమ్‌ది. అందుకే ఎంచక్కా సేఫ్ సైడ్ ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న లవ్ స్టోరీని రెడీ చేస్తున్నాడట త్రివిక్రమ్. ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ కూడా అలాంటి స్కిప్ట్‌లో కనిపించలేదు కాబట్టి ఎన్టీఆర్ కూడా ఒకే అన్నాడట. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలతో ఎన్టీఆర్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. కథ, కథనాలు బలహీనంగా ఉన్నప్పటికీ జైలవకుశ సినిమాను కూడా వెండితెరపైనా, బుల్లితెరపైన కూడా హిట్ చేశాడు ఎన్టీఆర్. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ సక్సెస్‌ని కంటిన్యూ చేసేలా……. ఎన్టీఆర్‌ని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్ళే స్థాయి సినిమా అంటే త్రివిక్రమ్‌కి కత్తి మీద సాము లాంటి వ్యవహారమే. పైగా కచ్చితంగా సక్సెస్ అవ్వాల్సిన పరిస్థితి త్రివిక్రమ్‌ది. ఎలాంటి అవుట్ పుట్‌తో వస్తాడో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -