Tuesday, April 30, 2024
- Advertisement -

చేసేది కూలీప‌ని…ల‌క్ష‌ల్లో సంపాద‌న‌..ఎలానో తెలుసా..?

- Advertisement -

అత‌ను రోజూ కూలీ. మ‌మా ఉంటే ఆదాయం ఎంతంటుంది రోజుకు ఇదువంద‌లు..మ‌హా అయితే రూ. 1000 ఉంటుంద‌నుకుందాం. సంవ‌త్స‌రానికి మహా అయితే రూ.మూడు ల‌క్ష‌లు ఆదాయం. కాని అత‌ను ఖ‌రీదైన కూలీ. సంపాద‌న ఎంతో తెలిస్తే అందూ ముక్కున వేలువేసుకోవాల్సిందే.

బెంగళూరులో రాచప్ప అనే కూలీ మాత్రం ఏకంగా ఏడాదికి రూ.40 లక్షలు సంపాదిస్తున్నాడు. కూలీకి ఇంత ఆదాయం ఎలా సమకూరిందనే అనుమానం రావచ్చు. అందుకే మనోడు పక్కా లెక్కలతో ఐటీ రిటర్స్స్ కూడా ఫైల్ చేశాడు. కానీ ఆదాయపు పన్ను అధికారులకు దీనిపై ఎక్కడో తేడా కొట్టింది. మనిషి చూస్తే రోజువారీ కూలీ… ఆదాయం ఎలా వస్తుందబ్బా అంటూ ఆరా తీశారు.

అస‌లు సంగ‌తి బ‌య‌ట‌ప‌డింది. ఆదాయ‌పు ప‌న్నులెక్క‌ల్లో తేడా రావ‌డంతో క‌రెక్ట్‌ లెక్కలతో సహా రావాలని అతగాడికి నోటీసులు పంపించారు. అక్కడికెళ్లిన రాచప్ప ఐటీ అధికారులు అడిగిన వివరాలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలాడు. కేసును పోలీసులకు అప్పగించడంతో వాళ్లు రంగంలోకి దిగి అయ్యవారి అసలు గుట్టురట్టు చేశారు.

బెంగళూరు కనకపురా రోడ్డులోని రాచప్ప నివాసానికెళ్లిన పోలీసులకు అక్కడ ఊహించని షాక్ తగిలింది. ఇంట్లో 26 కిలోల గంజాయితో పాటూ రూ. 5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. రాచప్పను అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో మొత్తం వ్యవహారం బయటపెట్టాడు. తాను చేస్తున్న గంజాయి వ్యాపారంతో పాటూ… తనకు సహకరిస్తోన్న మిగతా ముఠా వివరాలను వెల్లడించాడు. లాయర్ సలహాతోనే తాను ఇలా చేశానని… కాంట్రాక్టర్‌గా హోదాలో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశానని తెలిపాడు.

కూలీ పనుల కోసం పుష్పపురా నుంచి బెంగళూరు వచ్చిన రాచప్ప… దాదాపు ఐదేళ్లగా గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. సాషు అనే వ్యక్తి దగ్గర నుంచి గంజాయి తెచ్చి… బెంగళూరులో అమ్ముతున్నట్లు విచారణలో తెలిపాడు. కిలో రూ.35వేల వరకు అమ్మిన రాచప్ప కోట్లాది రూపాయలు వేనకేసుకున్నాడు. విలాస‌వంత‌మైన జీవితం గ‌డుపుతున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న సాషు గురించి పోలీసులు గాలిస్తున్నారు. అతడు దొరికితే ఈ కేసులో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది. చూశారుగా ఖ‌రీదైన కూలీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -