Monday, April 29, 2024
- Advertisement -

ఆ హీరోయిన్ ని లైన్ లో పెట్టిన త్రివిక్రమ్ ?

- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం యంగ్ హీరో నితిన్-సమంత జంటగా ‘అ ఆ’ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ‘అ ఆ’ తర్వాత త్రివిక్రమ్‌ కోలీవుడ్ హీరో సూర్యతో ఓ సినిమా చేయటానికి రెడీ అవుతున్నాడు.

అయితే ఈ ప్రాజెక్ట్ లో సూర్య సరసన హీరోయిన్ కోసం భారీగానే కసరత్తులు చేస్తున్నాడట మాటల మాంత్రికుడు. అందులోభాగంగా బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొణేను హారోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట త్రివిక్రమ్. అందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు సమాచారం.

ఈ నయా చిత్రంలో హీరోయిన్ పాత్రకు దీపిక అయితే బాగా సూటవుతుందని, అలాగే ప్రాజెక్ట్ పై క్రేజ్ కూడా ఒక రేంజ్ లో పెరుగుతుందని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. అయితే హిందీలో వరుస సినిమాలతో బిజీగా వున్న దీపికా, త్రివిక్రమ్ ప్రపోజల్ కు ఓకే అంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. మరి దీపిక, త్రివిక్రమ్ సినిమాకు ఓకే చెబుతుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -