Saturday, April 20, 2024
- Advertisement -

హీరోయిన్ పెళ్లి.. నిశ్చితార్థం తర్వాత ట్విస్టులున్నాయా?!

- Advertisement -

ఇప్పటికే వరుణ్ మణియన్ తో త్రిష నిశ్చితార్థం జరిగిపోయింది. తమిళనాడుకు చెందిన ఆ వ్యాపారవేత్తతో త్రిష పెళ్లి త్వరలోనే అని ఆ మధ్య ప్రకటించారు.

ఇప్పటికే దాదాపు దశాబ్దంన్నర కాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్న త్రిష ఇలా పెళ్లి చేసుకొని ఒక ఇంటిది అవుతోంది అనుకొన్నారు అనేక మంది. ఇక వరుణ్ మణియన్ గురించి కూడా చాలా వార్తలు వచ్చాయి. అతడు పెద్ద వ్యాపారవేత్త అని చెప్పుకొన్నారంతా.

అయితే ఇంతకీ పెళ్లిప్పుడు.. ? అంటే మాత్రం సమాధానం లేదిప్పుడు! త్రిష ఈ విషయం గురించి మాట్లాడటానికి ఇష్టం చూపడం లేదు. ఇది నా పర్సనల్ విషయం అని అంటోందామె! మరి నిశ్చితార్థం అయ్యాకా.. పెళ్లి ఎప్పుడు ? అంటే… సిగ్గుపడుతూ ఏదో ఒక సమాధానం చెప్పాలి కానీ.. సీరియస్ అవుతుండటంతో మాత్రం అనుమానాలు అధికం అవుతున్నాయి.

ఈ విషయంలో ఇప్పటికే చాలా రూమర్లు కూడా వచ్చాయి. అయితే ఆ రూమర్ల గురించి త్రిష ఏమాత్రం పట్టించకోవడం లేదు. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగా ఆమె వ్యవహరిస్తోంది. అయితే వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని మాత్రమే త్రిష భావిస్తోందని… నిశ్చితార్థం గురించి ఎవరో సృష్టించిన పుకార్ల గురించి తనెందుకు సమాధానం చెప్పాలి? అని లెక్క చేయనట్టుగా వ్యవహరిస్తోందని.. వరుణ్, ఆమె మధ్య సత్సంబంధాలే ఉన్నాయని.. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -