Wednesday, May 22, 2024
- Advertisement -

లోకేష్ ఎందుకలా.. అంటే బాబు క్లాస్ పీకుతారు!

- Advertisement -

సాధారణ విమర్శలకు ఏ మాత్రం జడవడం లేదు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాకా ఆయన వ్యవహరణ తీరుపై సవాలక్ష విమర్శలు వస్తున్నా.. బాబు బలహీనతల గురించి ప్రత్యర్థులు దుమ్మెత్తిపోస్తున్నా బాబు లెక్క చేయడం లేదు.

ముందుగా బాబు రాజకీయ ప్రత్యర్థులు రుణమాఫీ వంటి అంశంతో మొదలుపెట్టారు.  ఏపీ ప్రభుత్వం  రైతు రుణమాపీని సక్రమంగా అమలు చేయకపోవడం పై వారు విమర్శలు చేశారు.

అయితే బాబు మాత్రం వాటిని లైట్  తీసుకొన్నారు. రుణమాఫీ అయిపోయిందనే బాబు నొక్కివక్కాణిస్తున్నారు. ఇక ఎన్నికల హామీల సంగతి అలా ఉంటే.. ఆ తర్వాతి వ్యవహారాల గురించి కూడా బాబుపై అనేక విమర్శలు వస్తున్నాయి. విదేశీ యాత్రలు.. తనకు దగ్గరవారైన వారికి అగ్రతాంబూలాలు ఇవ్వడం .. ప్రత్యేక విమానాలు వాడేసుకొంటూ ఖజానాపై భారం మోపడం వంటి వాటి విషయంలో విమర్శలు వస్తున్నాయి.

అలాంటి వాటిని పట్టించుకోనట్టుగా ముందుకుపోతున్న బాబు ఇప్పుడు తన తనయుడు లోకేష్్ ను ప్రమోట్ చేసుకోవడానికి కూడా అంతే తెగువతో వ్యవహరిస్తున్నాడు. లోకేష్ బాబు సెక్రటేరియటఠ్ లో తన ప్రైవేట్ స్టాఫ్ ను నియమించినా.. ఇప్పుడు అనధికార హోదాలో ఆయన విదేశాలకు వెళుతున్నా.. ప్రభుత్వ అధికారులను వెంట తీసుకెళ్లి ఓవరాల్ గా రాజ్యాంగేతర శక్తి అవుతున్నాడనే విమర్శలు వస్తున్నా.. బాబు లెక్క చేయడం లేదు. అసలు అలాంటి ఆరోపణలు తనకు వినిపించననట్టుగా వ్యవహరిస్తున్నాడు. అదేంటి అంటే… లోకేష్ బాబు గొప్పదనం గురించి తనే స్వయంగా వివరించడం మొదలుపెడతాడు బాబు. లోకేష్ ఎంత మేధావో వివరించే పని పెట్టుకొంటాడు. ఈ విధంగా చంద్రబాబు ముందుకు పోతున్నారు. మరి ఈ తీరు విమర్శల పాలయ్యేదే కాదు.. సామాన్యుల్లో అసంతృప్తిని కలిగించేది కూడా అని బాబు గుర్తుంచుకోవాలేమో! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -