Wednesday, May 15, 2024
- Advertisement -

మెగాస్టార్ ని ఆ మాట అనేసిన టీవీ నటి

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఏంతో మంది అభిమానులు ఉన్నారు. టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా మెగాస్టార్ ఉన్నారు. ఇటు రాజకీయాల్లోనూ రాజ్యసభ సభ్యుడి దాకా వెళ్లారు. అలాంటి హీరో గురించి ఏదైనా కామెంట్ చేయడమంటే అది మాములు విషయం కాదు. ఓ టీవీ నటి చిరు మీద షాకింగ్ కామెంట్స్ చేసి.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మీ అభిమాన హీరో ఎవరని?’ ప్రశ్నించగా.. ‘ముందు ప్రశ్న కరెక్ట్‌గా అడగడం నేర్చుకోండి?’ అంటూ యాంకర్‌కే వార్నింగ్ ఇచ్చింది నీతూ నారాయణ్. పవన్ కళ్యాణ్ తర్వాత మీ అభిమాన హీరో ఎవరో అని అడగాలని ఆ యాంకర్‌కి చెప్పింది. తనకు పవన్ అంటే చాలా అభిమనం అని.. ఆ తర్వాత మెగాస్టార్ ని అభిమానిస్తానని చెప్పింది. అంతటితో ఆగకుండా.. చిరంజీవి అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన ఆ నటి.. ఆయన పర్సనల్ లైఫ్ అంటే తనకు అంతగా ఇష్టం ఉండదని చెప్పింది. పవన్ స్టార్ అని అభిమానించడం లేదని.. ఇతరులకు మంచి చేయాలనే గొప్ప గుణం ఆయనలో ఉండటం వల్ల తనకు పవర్‌స్టార్ తర్వాతే ఎవరైనా అని తేల్చి చెప్పింది.

సినిమాలు విజయం సాధించినంత మాత్రన పెద్ద హీరోలు కాదని, పెద్ద హీరోగా చెలామణి అవుతూ ఎంత డబ్బు సంపాదించిన ఎలాంటి ఉపయోగం లేదని చెప్పింది. సహయం చేసేవారే నిజమైన హీరో అని.. హెల్పింగ్ నేచర్ ఉన్న పవన్ అంటే తనకిష్టమని పేర్కొంది. ఇలా పవన్‌పై వున్న అభిమానం చాటుకోవడం కోసం నీతూ రెచ్చిపోయి మాట్లాడిన మాటలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. ప్రధానంగా మెగా ఫ్యాన్స్ కు ఈమె కామెంట్స్ మింగుడుపడడం లేదు. దాంతో ఈమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -