Saturday, May 18, 2024
- Advertisement -

జ‌గ‌న్ ఎఫెక్ట్‌…..

- Advertisement -

నంద్యాల అసెంబ్లి స్థానానికి ఈనెల 23న ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. త‌మ అభ్య‌ర్తుల‌ను గెలిపించు కొనేందుకు ప్ర‌జ‌ల‌పై హామీల వ‌ర్షం కురిపిస్తున్నారు.ఎన్నిక‌ల ప్ర‌చారాన్నికూడా పోటీ పోటీగా నిర్వ‌హిస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే ఏం చేస్తామనే విషయాలపై హమీల వర్షం కురిపిస్తున్నారు నేతలు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాక ముందు నుండే ఈ నియోజకవర్గంలో పార్టీల హమీలతో నంద్యాల ఓటర్లు తడిసిముద్దౌతున్నారు.

ఈ నెల 3వ, తేదిన జరిగిన ఎన్నికల సభలో పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాన్ని జిల్లాలుగా మార్చనున్నట్టు వైసీపీ చీఫ్ జగన్ ప్రకటించారు. అంతేకాదు దీంతో నంద్యాల కూడ జిల్లాగా మారనుంది. ఈ విషయాన్ని జగన్ ప్రకటించారు. అంతె టీడీపీ గుండెల్లో భ‌యం మొద‌ల‌య్యింది. వైసీపీ చీఫ్ జగన్ ఈ విషయాన్ని ప్రకటించడంతో తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

నంద్యాలను జిల్లాగా మార్చాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది. అయితే ఈ నంద్యాలను జిల్లాకేంద్రంగా ఏర్పాటుచేసే విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకొంటామని ఏపీ డిప్యూటీ సీఎం కె.ఈ. కృష్ణమూర్తి ప్రకటించారు. దీని విషయమై అధికారులకు ఆదేశాలను ఇచ్చినట్టు ఆయన చెప్పారు.

ఎప్ప‌టినుంచో ఉన్న జిల్లా డిమాండ్‌ను ఇప్పుడే గుర్తుకొచ్చింది మంత్రిగారికి. ఇదంతా ఇప్పుడు ఎన్నిక‌లు ఉన్నాయ‌నె కార‌నంగానె నిర్న‌యం తీసుకున్నార‌న్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌త్యేక జిల్లానుఏర్పాటు సాధ్యాసాధ్యాల‌ను ప‌రిశీలించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -