Saturday, May 4, 2024
- Advertisement -

బాబు దురాశ.. దుక్కానికి చేటు…

- Advertisement -

రాష్ట్రాల‌లో అధికార పార్టీతో పాటు ప్ర‌తిప‌క్షాలు ఉంటెనె ప‌రిపాల‌న సాగుతుంది. ప్ర‌భుత్వ వైప‌ల్యాల‌ను ప్ర‌జ‌ల‌ల్లోకితీసుకెల్లేందుకు ,వారి స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెల్ల‌డంతో ప్ర‌తిప‌క్షాల పాత్ర‌ముఖ్యం. కాని ఏపీలో మాత్రం అధికార పార్టీ దురాశ‌కు అంతేలేదు. అస్స‌లు ప్ర‌తిప‌క్ష‌పార్టీనె లేకుండా చేయాల‌నె బాబు దురాశ చివ‌ర‌కు ఆయ‌న‌కె నిద్ర‌లేకుండా చేస్తోది.

సీట్లు పెరుగ‌తాయ‌ని ఇత‌ర పార్టీ ఎమ్మెల్యేల‌కు ఆశ చూపి పిరాయింపుల‌ను ప్రోత్స‌హించారు.చివ‌రికి కేంద్రం మాత్రం సీట్లు పెర‌గ‌వ‌ని చావుక‌బురును చ‌ల్ల‌గా చెప్పింది.దీంతో అన్ని నియేజ‌క వ‌ర్గాల్లో పార్టీలో ఆదిప‌త్య‌పోరు కొన‌సాగుతోంది. దీంతో ఇత‌ర పార్టీల‌వైపు చూస్తున్నారు ముఖ్య‌నాయ‌కులు.

ప్రకాశం జిల్లాలోని ఇద్దరు సీనియర్ నేతలు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వైసీపీ నుండి టిడిపిలోకి వచ్చిన ఫిరాయింపు ఎంఎల్ఏలతో ఇద్దరికీ పడకపోవటమే ప్రధాన కారణం. జిల్లాలోని అద్దంకి నియోజకవర్గం నుండి కరణం బలరాం, కందుకూరు నియోజకవర్గం నుండి దివి శివరాం టిడిపికి గుడ్ బై చెప్పటం ఖాయమని సమాచారం. అద్దంకి ఎంఎల్ఏ గొట్టిపాటి రవికుమార్-కరణం వర్గా మధ్య గొడలు అందరికీ తెలిసిందే

పార్టీ పెట్టినప్పటినుండి టిడిపిలోనే ఉన్న తనను కాదని వైసీపీ నుండి ఏడాది క్రితం వచ్చిన గొట్టిపాటికి సిఎం మద్దతుగా నిలవటాన్ని కరణం జీర్ణించుకోలేకపోతున్నారు. అఅద్దంకిలో పోటీ చేసే అవకాశం లేక, నియోజకవర్గాల పెంపు కుదరక, గొట్టిపాటిని తట్టుకోలేక చివరకు టిడిపికి గుడ్ బై చెప్పటమే మేలని మద్దతుదారులు కూడా తేల్చిచెప్పటంతో కరణం వెంటనే జగన్మోహన్ రెడ్డితో టచ్ లోకి వెళ్ళారట.

కరణం వర్గాన్ని తీసుకోవటానికి జగన్ కూడా సానుకూలంగానే ఉన్నారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో కరణం కొడుకు కరణం వెంకటేష్ కు అద్దంకిలో టిక్కెట్టు ఇవ్వటానికి కూడా సుముఖంగానే ఉన్నారట. ఇదిలావుండగా కరణం దారిలోనే కందుకూరు మాజీ ఎంఎల్ఏ దివి శివరాం కూడా నడవటానికి సిద్ధపడ్డారు. నంద్యాల ఉపఎన్నిక తర్వాతే వీరిద్దరి విషయాన్ని జగన్ ఫైనల్ చేయనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -