Wednesday, May 15, 2024
- Advertisement -

ఉంగరాల రాంబాబు ప్లాప్.. సునీల్ ఏం చేస్తున్నాడు..?

- Advertisement -

కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. హీరోగా మారారు కమెడియన్ సునీల్. ‘అందాల రాముడు’ ‘మర్యాద రామన్న’ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నాడు. అ తర్వాత పుల రంగడు తో మంచి హిట్ అందుకున్నాడు. అయితే మూడు సంవత్సరాల నుంచి సునీల్ కి ఏ సినిమా కలిసి రావడం లేదు.

ఇక లాభం లేదనుకోని తన కామెడీనే నమ్ముకున్న సునీల్ ‘ఉంగరాల రాంబాబు’ చిత్రంతో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా ప్లాప్ జాబితాలో చేరిపోయింది. ఈ సినిమా పై మొదటి నుంచి ఎన్నో అంచనాలు వేసుకున్న సునీల్ డివైడ్ టాక్ రావడంతో నిరాశలో పడ్డారు. సినిమా ప్రమోషన్ కోసం సునీల్ బిగ్ బాస్ లో కూడా సందడి చేశారు. కామెడీ బేస్ అయినా సినిమాలో రైతు పోరాటం గురించి చూపించారు. జాతకాలు నమ్ముకున్న సునీల్ ఈ సినిమాలో కామెడీ పరంగా బాగానే ఆకట్టుకున్నాడు.

అయితే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికి.. సినిమా ప్రేక్షకులు ప్లాప్ చేశారు. దాంతో సునీల్ ఇక కమెడియన్ గా కొనసగాలని ప్లాన్ చేస్తున్నాడు. మంచి కథ దొరికితే సినిమా లేకుంటే.. ఇక కమెడియన్ గా మళ్లీ సినిమాలు చేసుకోవాలని పక్క ప్లాన్ తో వెళ్తున్నాడు. ఉంగరాల రాంబాబు ప్లాప్ కావడం వల్ల ఇక సునీల్ హీరోగా చేసే సినిమాలు పక్కన పెట్టి.. పెద్ద సినిమాలో కామెడీ రోల్ కోసమ్ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -