Tuesday, May 14, 2024
- Advertisement -

స్పైడర్ “సిసిలియా” అంటే ఏంటో తెలుసా..?

- Advertisement -

మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న సైడర్. ఈ సినిమా ట్రైలర్ ఇటివలే రిలీజ్ అయింది. ప్రతి ఒక్కరు ఈ సినిమా ట్రైలర్ చాలా కొత్తగా ఉంది అని అంటున్నారు. మహేష్ లుక్ కూడా బాగుందని చెప్తున్నారు. అయితే ఈ సినిమాలో సిసిలియా.. అనే సాంగ్ ఉంది. అయితే సిసిలియా.. సిసిలియా అనే పదంకు అర్ధం ఏంటో అని ఫ్యాన్స్.. సైడర్ పాటలు వినే వాళ్లకు పెద్ద ప్రశ్న అయ్యిందట.

ఎవరికీ అంతుచిక్కని ఈ మాట గురించి ఈ పాట రాసిన రామజోగయ్య శాస్త్రి క్లారిటీ ఇచ్చారట. అస‌లు సిసిలియా అంటే ఏంటో తెలుసా? ‘అంద‌మైన అమ్మాయి’ అని త‌న‌తో రామ‌జోగ‌య్య శాస్త్రి చెప్పాడ‌ని యాంక‌ర్ సుమ చెప్పింది. హైదరాబాద్ లోని శిల్ప‌కళా వేదిక‌లో స్పైడ‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈవెంట్ లో సినీ గేయ ర‌చ‌యిత రామ‌జోగ‌య్య శాస్త్రి మాట్లాడిన త‌రువాత సుమ ఈ విష‌యం చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు అందరూ రామజోగ‌య్య శాస్త్రిని ఆకాశానికి ఎత్తేసారట.

ఎక్కడైనా టీజర్ లో సన్నివేశాలు చూసి.. క్యూరియాసిటీ పెంచుకుంటారు ప్రేక్షకులు. కానీ శాస్త్రి గారి పాటల్లో మాటలకోసం అభిమానులు క్యూరియాసిటీ పెంచుకోవడం ఆశ్చర్యంగా ఉంది. ఈ వేడుకకు వచ్చిన రచయిత రామజోగ‌య్య శాస్త్రి మాట్లాడుతూ.. ఈ సినిమా పక్కా హిట్ అవ్వడం ఖాయమని.. ఈ సినిమాకి పాటలు రాసే అవకాశం కలిపించిన దర్శకుడు, హీరోలకు కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకుంటున్నాన‌ని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -