Monday, May 6, 2024
- Advertisement -

పుష్ప 2..ఐటెంగా ఊర్వశి!

- Advertisement -

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం పుష్ప. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రంతో బన్నీ ఉత్తమ జాతీయ నటుడిగా ఎంపికయ్యారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌ పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2024 ఆగస్టు 15న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇక ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా దానిని వైరల్‌ చేసేస్తున్నారు అభిమానులు. ఫస్ట్ పార్టులో ఐటం సాంగ్‌లో ఉ అంటావా మావా అంటూ రెచ్చిపోయింది సమంత. ఇక సెకండ్ పార్టులోనూ ఓ స్పెషల్ సాంగ్‌కు ప్లాన్ చేస్తున్నారట దర్శకుడు సుక్కు.

స్పెషల్ సాంగ్‌ని వచ్చే షెడ్యూల్ లో చిత్రీకరించనుండగా ఇందుకోసం ఊర్వశి రౌటేలాను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజ‌య్ ద‌త్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారని, బ‌న్నీ- సంజ‌య్ మ‌ధ్య యాక్ష‌న్ ఉంటుందని తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -