Sunday, May 19, 2024
- Advertisement -

ఏపీసీసీ చీఫ్‌గా షర్మిల..క్లారిటీ ఇచ్చిన రుద్రరాజు!

- Advertisement -

వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరికకు ముహుర్తం ఖరారైందా..?తన పార్టీని విలీనం చేస్తామని షర్మిల ప్రతిపాదనకు ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా.? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఉనికి చాటేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. ఇందులో భాగంగా ఇప్పటికే పార్టీ వ్యవహారాల ఇంఛార్జీగా మాణికం ఠాగూర్‌ని నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. త్వరలోనే రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు రాహుల్.

ఓ వైపు పార్టీ బలోపేతం కోసం దృష్టి సారిస్తూనే మరోవైపు చేరికలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట హస్తం నేతలు. ఇందులో భాగంగా ప్రధానంగా వినిపిస్తున్న పేరు వైఎస్ షర్మిల. వైఎస్‌ఆర్‌టీపీని స్థాపించి తెలంగాణ రాజకీయాల్లో సత్తాచాటాలని భావించిన తీరా ఎన్నికల సమయంలో పోటికి దూరంగా ఉండిపోయారు. ఇక పలుమార్లు కాంగ్రెస్ అగ్రనేతలను కలిసి తన పార్టీని విలీనం చేసేందుకు సుముఖత కూడా చూపించారు. అయితే కొన్ని అనివార్యకారణాల వల్ల విలీనానికి బ్రేక్ పడినా ఇప్పుడు ఏపీ ఎన్నికలు సమీపిస్తుండటంతో షర్మిల కాంగ్రెస్‌లో చేరికకు ముహుర్తం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.

త్వరలోనే షర్మిలను ఏపీసీసీ చీఫ్‌గా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. 27న(రేపు) రాహుల్ గాంధీతో జరిగే సమావేశంలో షర్మిల చేరిక, పొత్తుల అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు షర్మిల చేరికకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు పీసీసీ చీఫ్ రుద్రరాజు. కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల వస్తే స్వాగతిస్తానని అయితే ఆమెను ఏపీ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలిని చేస్తారన్న దానిపై మాత్రం తనకు సమాచారం లేదని చెప్పుకొచ్చారు. మొత్తంగా షర్మిల కాంగ్రెస్‌లో చేరిక, ఏపీ అధ్యక్షురాలు అన్న వార్త ఇప్పుడు పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -