Tuesday, May 6, 2025
- Advertisement -

నాగార్జున డైరెక్టర్ తో వరుణ్ తేజ్ కొత్త సినిమా..?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తనదైన స్టైల్లో సినిమాల్లో నటిస్తూ,కథల ఎంపిక విషయంలో కొత్తదనం చూపిస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.వరుణ్ తేజ్ తెలుగు తెరకు “ముకుంద” మూవీతో పరిచయమై కంచె, లోఫర్, మిస్టర్, ఫిదా, అంతరిక్షం,ఎఫ్ 2 వంటి సినిమాల్లో నటించాడు.

వరుణ్ తేజ్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. వరుణ్ ప్రస్తుతం బాక్సింగ్ బ్యాగ్ డ్రాప్‌లో వస్తోన్న “గని “సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రం కోసం వరుణ్ ప్రత్యేకంగా బాక్సింగ్ శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే. వరుణ్ ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న” ఎఫ్ 3″లో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ 50శాతం కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది.

Also read:కరోనా వచ్చినప్పుడు వారే నాకు దైర్యం చెప్పారు: అనిల్ రావిపూడి

వరుణ్ తేజ్ తాజాగా మరో రెండు సినిమాలను లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది.గరుడవేగ ప్రేమ్ దర్శకుడు ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో వరుణ్‌ తేజ్ నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు నాగార్జునతో ఓ సినిమా చేస్తున్నారు.ఇది పూర్తయిన వెంటనే వరుణ్‌ సినిమా షూటింగ్ ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు.ఇక వరుణ్ తేజ్ ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. దర్శకుడు వెంకీ కుడుముల వరుణ్ తేజ్ కి కథ వినిపించగా దాదాపు ఓకే అయినట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Also read:వెళ్లి వాళ్లని అడుక్కోడంటూ ఫైర్ అయిన నటి రేణు దేశాయ్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -