- Advertisement -

వెళ్లి వాళ్లని అడుక్కోడంటూ ఫైర్ అయిన నటి రేణు దేశాయ్?

- Advertisement -

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎంతోమంది తమ వంతు సాయంగా కరోనా బాధితులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే నటి రేణు దేశాయ్ కూడా కరోనా బాధితుల కోసం తనవంతు సాయం చేస్తున్నారు.
కరోనా బాధితుల కోసం తనకు తెలిసిన హాస్పిటల్ వివరాలు, ఆక్సిజన్,బెడ్స్, మందులు వంటి వివరాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ కరోనా బాధితులకు రేణు దేశాయ్ సహాయం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఎంతోమంది బాధితులు తమ అవసరం కోసం రేణుదేశాయ్ కి మెసేజ్ చేయడంతో ఆమె వెంటనే స్పందించి వారికి సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ మెసేజ్ ఇన్ బాక్స్ కోసం మెసేజ్ పెట్టే వారి కన్నా ఎంతోమంది ఆకతాయిలు హాయ్, హలో అంటూ మెసేజ్ పెడుతున్నారు.ఈ క్రమంలోనే రేణుదేశాయ్ అనవసరంగా హాయ్, హలో అని మెసేజ్ లు పెట్టడం వల్ల అవసరం ఉన్నవారికి మెసేజ్లు కిందికి పోతున్నాయి.నేను ఆ మెసేజ్ లు చూడక పోవటం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు దయచేసి ఇలాంటి మెసేజ్ లు పెట్టకండి అంటూ తన అభిమానులను కోరారు.

Also read:నాగార్జున, కోదండరామిరెడ్డి కాంబో సక్సెస్ ఫుల్ సినిమాలు?

రేణు దేశాయ్ ఈ విధంగా స్పందించడంతో నెటిజన్ ఆమెను వేలెత్తి చూపాడు. మీరు మిడిల్ క్లాస్ వారికి సహాయం చేయరా?వాళ్లని పట్టించుకోరా? అంటూ ఆమెను ప్రశ్నించడంతో రేణుదేశాయ్ ఆ నెటిజన్ పై ఫైర్ అయ్యారు. నేను గత పది రోజుల నుంచి నాకు చేతనైన సహాయం చేస్తున్నాను. నేనేమీ రాజకీయ నాయకురాలిని కాదు.. మీరు ప్రశ్నించడానికి.. మీరు ప్రశ్నించడానికి ఓట్లు వేసి ఎన్నికైన ప్రజా ప్రతినిధిని కాదు.. వెళ్లి మీరు ఓటు వేసిన నాయకులను అడుక్కోండి అంటూ నెటిజెన్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also read:డాడీ సినిమాలో చిన్నారి ఇప్పుడు ఎంత అందంగా ఉందొ తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -