Thursday, March 28, 2024
- Advertisement -

కరోనా వచ్చినప్పుడు వారే నాకు దైర్యం చెప్పారు: అనిల్ రావిపూడి

- Advertisement -

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్ బారినపడి వైద్యుల సూచనల మేరకు హోం ఐసోలేషన్‌లో ఉంటున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా అనిల్ రావిపూడి కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకొని హోం ఐసోలేషన్‌లో ఎదుర్కొన్న సమస్యలను ఆయన అనుభవాలను అభిమానులతో పంచుకున్నాడు

వైద్యుల సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండడానికి ఎంతో ప్రయత్నం చేశానని దానికోసం వ్యాయామం, పుస్తకాలు చదవడం, ఇంకా కొన్ని కొత్త స్క్రిప్టులు రాయడానికి ప్రయత్నం చేశానని చెప్పాడు.నేను హోం ఐసోలేషన్‌లో ఉన్న సమయంలో హీరో వరుణ్ తేజ్, వెంకటేశ్ ఫోన్ చేసి తగు జాగ్రత్తలు చెబుతూ నాలో ధైర్యం నింపడానికి ప్రయత్నం చేసేవారు. మహేష్ బాబు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ తన సరదా మాటలతో నవ్విస్తూ ఉండేవారని చెప్పాడు. దీంతో నాకు కరోనా సోకిందన్న భావనను కూడా మర్చిపోయా అంటూ తన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు.

Also read:లాక్‌డౌన్‌ లో బిగ్ బాస్ షూటింగ్… సీల్ చేసిన పోలీసులు!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో గతేడాది మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన “సరిలేరు నీకెవ్వరు” సినిమా గ్రాండ్ సక్సెస్ తర్వాత ‘ఎఫ్‌2’కి సీక్వెల్ మూవీ ‘ఎఫ్3’ సినిమాని వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా మల్టీస్టారర్ మూవీని రూపొందిస్తున్నారు.దాదాపు సగం పూర్తయిన ఈ సినిమా షూటంగ్ కార్యక్రమాలు కరోనా కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే.

Also read:ప్రభాస్ సలార్ సినిమాలో సందడి చేయనున్న సీనియర్ నటి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -