Thursday, March 28, 2024
- Advertisement -

అభిమానులకు నచ్చుతేనే ఆనందం అంటున్న తమన్నా!

- Advertisement -

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం హీరోయిన్ గా ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులకు కనువిందు చేస్తు దూసుకుపోతోంది. తాజాగా తమన్నా తమిళంలో నటిస్తున్న వెబ్‌సిరీస్‌ ‘నవంబర్‌ స్టోరీస్‌’ ఆనంద్‌ వికటన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ వెబ్ సిరీస్‌కు ఇంద్ర సుబ్రమణియన్‌ డైరెక్షన్‌ వహిస్తున్నారు. ఇటీవల వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ వెబ్ సిరీస్‌ మే 20 న హాట్‌స్టార్‌లో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది ఈ సందర్భంగా హీరోయిన్ తమన్నా కొన్ని ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు.

ఈ వెబ్ సిరీస్‌ లో తమన్నా అనురాధ అనే ఓ ఎథికల్ హ్యాకర్ పాత్రను పొషించానని, ఇప్పటివరకు తాను నటించిన అన్ని పాత్రల్లో ఇది ప్రత్యేక మైంది. స్క్రిప్ట్, కథాంశం అలాగే రామ్ సుబ్రమణియన్ దర్శకత్వం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు.సృజనాత్మక నైపుణ్యాలను తెలుసుకునేందుకు నాకు ఈ ప్రాజెక్ట్ చాలా ఉపయోగపడిందిని . నేను ఈ పాత్రలో ప్రేక్షకులను మెప్పిస్తే నాకు ఆనందంగా ఉంటుందని తమన్నా చెప్పుకొచ్చింది.ఏడు ఎపిసోడ్లుగా రానున్న ఈ నవంబర్‌ స్టోరీస్‌ లో పసుపతి, జీఎం కుమార్, అరుల్దాస్, వివేక్ ప్రసన్న తదితరులు నటించారు.

Also read:పిల్లల్ని హత్తుకొని ఎమోషనల్ అయిన అల్లు అర్జున్..ఎందుకంటే?

ప్రస్తుతం తమన్నా హీరోయిన్ గా తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లో న‌టిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. గోపీచంద్ తమన్నా జంటగా నటించిన “సిటీ మార్” మూవీ ఇప్పటికే విడుదలకు సిద్ధంగా ఉంది.ఇందులో తమన్నా తెలంగాణ కబడ్డీ కోచ్‌ జ్వాలారెడ్డిగా నటిస్తోంది.అలాగే విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ మూవీ ఎఫ్‌ 3 లోను, గుర్తందా శీతాకాలం, మాస్ట్రో వంటి చిత్రాల్లో నటిస్తోంది.

Also read:హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న మరో వారసురాలు.. ఎవరంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -