Monday, April 29, 2024
- Advertisement -

కీరాతో కూల్ కండి..

- Advertisement -

ఎండవేడిమితో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రధానంగా డీ హైడ్రేషన్‌తో వ్యాధుల బారిన పడుతుండటంతో వేసవి నుండి ఉపశమనం పొందే ఆహార పదార్థాల వైపు పరుగులు పెడుతున్నారు. ఇక శరీరాన్ని డీ హైడ్రేషన్ బారిన పడకుండ కాపాడటంలో కీరది ప్రత్యేక పాత్ర.

కీరా తినడం వల్ల చల్లని ఉపశమనం లభిస్తుంది. ఎన్నో పోషకాలతో నిండి ఉన్న ఈ కీరా.. శరీరానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఇందులో ఉండే నీటి శాతం వేడిలో శరీరాన్ని డీహైడ్రేషన్ నుండి రక్షిస్తుంది కీరాలో దాదాపు 95% నీరు ఉంటుంది ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, జీవక్రియ మెరుగుపర్చడానికి దోహదం చేస్తుంది.

కీరలో పొటాషియం, మెగ్నీషియం మరియు సోడియం వంటి ఎలక్ట్రోలైట్లు కండరాల పనితీరు మరియు నరాల సంకేతాలను నిర్వహించడానికి సహాయపడుతుంది.కీర దోసకాయలు సూర్యరశ్మీ నుండి వచ్చే యువీ కిరణాల నుండి రక్షణ కల్పిస్తాయి. కీరలో కేలరీలు తక్కువగా ,నీరు మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. కీర దోసకాయలు జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్‌లను కలిగి ఉండి ఆరోగ్యాన్ని సంరక్షించడానికి దోహదం చేస్తాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -