Wednesday, May 15, 2024
- Advertisement -

అర్జున్ రెడ్డి 2 కథ ఇదే.. ఇక పక్కా మరో హిట్.?

- Advertisement -

అర్జున్ రెడ్డి.. ఈ సినిమా వివదాలతో మొదలు అయ్యి.. సంచలనం సృష్టించింది. కొత్త డైరెక్టర్ సందీప్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా శాలినీ హీరోయిన్ గా నటించింది. చాలా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది.

ఈ సినిమాలో విజయ్ పాత్రకు చాలా పొగరు ఎక్కువ. తాను చేసిందే కరెక్ట్, అదే వేదాంతం అన్నట్లు ప్రవర్తిస్తుంటాడు. తన అలవాట్లు, ఎమోషన్లు పట్ల తనకే ఒక సెల్ప్ కంట్రోల్ లేకుండా అప్ప‌టిక‌ప్పుడు బుర్ర‌కు ఏది తోస్తే అది చేస్తూ చూసిన వారికి ఉన్మాది అనే భావ‌న క‌నిపించేలా ప్ర‌వ‌ర్తిస్తాడు. తమ ప్రేమ ఒప్పుకోలేదని హీరోయిన్ తండ్రిని కూడా నోటికొచ్చిన మాట‌లు తిడుతాడు. ఇక ఆమె దూరం అయ్యాక అతను చేసే రచ్చ మాములుగా ఉండదు. త‌న ఫ్యామిలీని వ‌దిలేసి మందుకు బానిస అవుతాడు. త‌న ప్రేయ‌సిని మ‌ర్చిపోవ‌డం కోసం వేరే అమ్మాయిల‌తో ప‌డ‌క గ‌ది పంచుకుంటాడు. చివ‌రికి ఓ హీరోయిన్‌ను కూడా బుట్ట‌లో ప‌డేస్తాడు. అవ‌న్నీ జ‌నాల‌కు బాగా న‌చ్చాయి. ఏదైతేనేం చివ‌రికి ఎలాగోలా హీరో హీరోయిన్ క‌లిసిపోతారు. హ్యాపీ ఎమోష‌న్స్ తో సినిమాకి శుభం ప‌లికారు.

మరి ఆ తర్వాత ఏం జరిగింది..? వారిద్దరు కాపురం ఎలా సాగింది..? త‌న‌కు ఇష్టం వ‌చ్చిన‌ట్లు చేసే భ‌ర్త‌తో హీరోయిన్ త‌న త‌దుప‌రి జీవితం ఎలా గ‌డిపింది..? ప్రియురాలి నుంచి భార్య‌గా మారిన ఆ హారోయిన్ త‌న భ‌ర్త ప్ర‌వ‌ర్త‌న ప‌ట్ల ఇప్పుడు ఏ అభిప్రాయంతో ఉంది..? పిల్లల పట్ల అర్జున్ రెడ్డి ప్రవర్తన ఎలా ఉంది..? వారి ఎదుగుద‌ల ఎలా ఉంది..? అన్న అంశాల‌ను మాత్రం చూపించ‌లేదు. అవన్ని అర్జున్ రెడ్డి 2లో చూపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి దీనిలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ.. అర్జున్ రెడ్డి కోసం ఫ్యాన్స్ మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -