Monday, May 6, 2024
- Advertisement -

వైసీపీలో ఇంటి దొంగ‌లు.. సొంత‌పార్టీనేత‌లె జ‌గ‌న్ కొంప ముంచ‌నున్నారా…?

- Advertisement -

ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌లో స‌ర్వేలు ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇన్నాల్లు జాతీయ పార్టీల‌కె ఉన్న ఈ స‌ర్వేల పిచ్చి ఇప్పుడుప్రాంతీయ పార్టీల‌కు ప‌ట్టుకుంది. త‌మ‌పై ప్ర‌జ‌ల‌ల్లో ఎలాంటి అభిప్రాయం నుంచి ప్ర‌త్య‌ర్థుల‌కు ఎలాంటి అభ‌ప్రాయం , కుల ,మ‌తాల ద‌గ్గ‌ర‌నుంచి ప్ర‌జ‌ల నాడిని ప‌సిగ‌ట్టేందుకు అన్ని పార్టీలు సొంతంగా, ఇత‌ర సంస్థ‌ల‌తో స‌ర్వేలు చేయించుకుంటున్నారు. అయితె అన్ని స‌ర్వేల ఫ‌లితాలు ఖ‌శ్చ‌తంగా ఉండ‌వు ఒక్కోసారి విరుద్ధంగా ఉంటాయి.

ప్ర‌ధానంగా స‌ర్వే చేసె వ్య‌క్తుల్లో నిజాయితీ, నిబ‌ద్ధ‌త‌లోపించ‌డంతోపాటు తూతూమంత్రం స‌ర్వే చేయించి నిజాలు చెప్ప‌కుండా అబ‌ద్ద‌పు రిపోర్టులు ఇవ్వ‌డంవ‌ల్ల పార్టీ అంచ‌నాలు తారుమారు అవుతుంటాయి. దీనికి ఉదాహ‌ర‌ణ చూసుకుంటె వైసీపీనె. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పార్టీ అధికారంలోకి వ‌స్తాద‌ని అన్ని స‌ర్వేల‌లో అనుకూలంగా ఫ‌లితాలు వ‌చ్చాయి. అయితె ఎన్నిక‌ల త‌ర్వాత చూసుకుంటె టీడీపీ అధికారంలోకి వ‌చ్చి వైసీపీ అంచ‌నాలు త‌ల‌కిందుల‌య్యాయి.

అయితె ఇప్పుడు కూడా అలాంటి స‌ర్వే చేప‌ట్టింది వైసీపీ. గ‌తంలో స‌ర్వేలు మిగిల్చిన చేదు అనుభ‌వాల్నె మ‌రో సారి ఎదుర్కోభోతుందా అనే వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పార్టీ ప‌రిస్తితులు ఎలా ఉన్నాయో తెలుసుకొనేందుకు ఒక సంస్థకు సర్వే బాధ్యతలు అప్పగించగా.. అది సరిగా పనిచేయడం లేదని సమాచారం . దీంతో ఇప్పుడు వైసీపీ నాయ‌కుల్లో అందోళ‌న మొద‌ల‌య్యింది.

ఒక ప్ర‌యివేటు సర్వే సంస్థకు అధ్యయనం చేయ‌డానికి బాధ్య‌త‌లు అప్ప‌గించారు పార్టీ పెద్ద‌లు. అయితె ఈ సంస్థ మాత్రం ఇన్ చార్జిలకు కాకుండా కొత్తగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కావాలని అనుకుంటున్న వారికి అనుకూలంగా డబ్బులకు లొంగి వారికి అనుకూలంగా స‌ర్వే చేస్తున్నార‌నె వినికిడి బ‌లంగా వినిపిస్తోంది.

మొద‌ట మూడు వేల శాంపిల్స్ తీస్తున్నామని పార్టీకి చెప్పి.. వంద నుంచి రెండు వందల శాంపిల్స్ తీసుకుని.. మిగతావాటి కోసం లోకల్ గా ఉండేవాళ్ల ఫోన్ నంబర్లు వేస్తున్నారని, వారికి కావాల్సిన వాళ్లకు అనుకూలంగా ఈ సంస్థ సర్వేలు చేస్తోందని ప్రచారం పార్టీలో ముమ్మ‌రంగా జరుగుతోంది. ఇటీవల ప్రకాశం జిల్లాలో కందుకూరు నియోజకవర్గంలో ఇలానే జరిగిందని వైసీపీలో లేని మాజీ మంత్రికి వ్యక్తి అయిన మాజీ మంత్రికి అలాగె గిద్దలూర్ లో ఒక మాజి ఎమ్మెల్యే కి అనుకూలంగా నివేదిక ఇచ్చారని సమాచారం. పార్టీ కోసం ప‌నిచేసె వాల్ల‌కు టికెట్లు ఇవ్వ‌కుండా ఇలా చేయ‌డం వ‌ల్ల జ‌గ‌న్ మ‌రో సారి త‌ప్పుడు స‌ర్వేల మాయ‌లో ప‌డ్డార‌ని పార్టీ నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు.

పదో తరగతి ఫెయిల్ అయిన వాళ్లందరికీ సర్వేలు చేయించిన అధ్య‌య‌నాల‌న్నింటిలోను త‌ప్పుడు రిపోర్టులే వ‌చ్చాయంట‌. గ‌తంలో ఒక సారి మోస‌పోయిన జ‌గ‌న్ ఇప్పుడు మ‌రో సారి మోసపోతున్నార‌నె భావ‌న‌ను పార్టీ నాయ‌కుల్లో ఆందోళ‌న క‌లిగిస్తోంది. దీనిపై జ‌గ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -