Tuesday, April 30, 2024
- Advertisement -

రష్మికతో వెకేషన్‌లో విజయ్!

- Advertisement -

గీతాగోవిందం సినిమాతో వారిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారారు విజయ్, రష్మికా. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ అదుర్స్‌. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా రాకపోయినప్పటికి ఫ్రెండ్ షిప్ మాత్రం అలాగే కొనసాగుతోంది. ఇక రీసెంట్‌గా ఫ్యామిలీ స్టార్ సినిమాతో మెప్పించారు విజయ్. రోజురోజుకు సినిమా వసూళ్లు పెరుగుతుండగా వెకేషన్‌లో ఉన్నారు విజయ్.

ఇక ఫ్యామిలీ స్టార్ విడుదల రోజే రష్మికా బర్త్ డే. ఈ బర్త్ డేని సెలబ్రేట్ చేయడం కోసమే.. విజయ్, రష్మిక వెకేషన్ కి వెళ్లారని ప్రచారం జరుగుతుండగా ఇందుకు సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేస్తున్నారు నెటిజన్లు.

దుబాయ్ జాయేద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో పని చేస్తున్న ఓ ఇండియన్ తన సోషల్ మీడియాలో విజయ్ తో కలిసి ఉన్న ఒక ఫొటోని షేర్ చేసి..ఈ ఫోటోని శ్రీవల్లి తీసింది అని చెప్పుకొచ్చాడు. దీంతో విజయ్ – రష్మికా వెకేషన్‌లో ఉన్నారని కన్ఫామ్ అయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -