Friday, May 3, 2024
- Advertisement -

కాంగ్రెస్ ఖాతా తెరిచేనా?

- Advertisement -

రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక శాతం ఓటుకే పరిమితమైంది కాంగ్రెస్. అయితే ఈసారి ఎలాగైనా ఖాతా తెరవాలనే పట్టుదలతో ఉంది కాంగ్రెస్. అందుకే ఈసారి ఏపీసీసీ చీఫ్‌గా షర్మిలను నియమించగా ఆమె తనదైన శైలీలో ప్రచారం చేస్తున్నారు.

ఇక కాంగ్రెస్ ఆశలన్ని ప్రకాశం జిల్లాలపైనే ఉన్నాయి. ఈ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన ఒక్క సీటునైనా గెలిచేలా అభ్యర్థుల ఎంపిక చేపట్టింది. ఒంగోలులో బీఆర్ గౌస్, కొండపిలో శ్రీపతి సతీష్, కనిగిరిలో కదిరి భవానీ, మార్కాపురంలో ఎస్కే సైదా, దర్శిలో పుట్లూరి కొండారెడ్డి, యర్రగొండపాలెంలో బూదాల అజితరావు, గిద్దలూరులో పగడాల రామస్వామి,చీరాలకు ఆమంచి కృష్ణమోహన్, సంతనూతలపాడుకు పాలపర్తి విజేశ్ రాజ్, అద్దంకిలో అడుసుమల్లి కిషోర్, పర్చూరులో నల్లగండ్ల శివ లక్ష్మీజ్యోతిని బరిలోకి దింపారు

చీరాలలో నుంచి ఆమంచి కృష్ణమోహన్‌, సంతనూతలపాడు నుంచి పాలపర్తి విజేష్‌ రాజ్‌, యర్రగొండపాలెం నుంచి బూదాల అజితరావు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -