Saturday, April 27, 2024
- Advertisement -

మహేష్ , బన్నీ కి వారు కరువయ్యరుగా..?

- Advertisement -

మన తెలుగు సినిమా లో కథానాయకుడు ఎలా ఉన్నా పర్వాలేదు కాని ప్రతినాయకుడు మాత్రం ఓ రేంజ్ లో ఉండాలి. కండలు తిరిగిన బాడీ, కోరమీసం, సిక్స్ ప్యాక్ శరీరం, ఉగ్రమైన కళ్ళు ఇలా ప్రతి ఒక్కటి హీరో కన్నా ఎక్కువ ఉండాలి.. కానీ హీరో కొడితే మాత్రం పడిపోవాలి.. ఇది తెలుగు సినిమాల్లో ఎప్పటినుంచి వస్తున్న సంప్రదాయం.. ఇదివరకు ప్రతినాయక పాత్రలకు స్పెషల్ గా కొంతమందిని ఎంపిక చేసుకుని వారినే కొనసాగించేవారు కాని ఇప్పుడు అలా కాదు, కథ నచ్చితే స్టార్ హీరో అయినా విలన్ గా కనిపించడానికి వెనుకాడట్లేదు.. అందుకోసం కొంత ప్రత్యేకంగా బాడీ పై దృష్టి పెడితే సరిపోతుంది..

అలా చాలామంది పాత హీరోలు , అవుట్ డేటెడ్ అయినా హీరోలు, సీనియర్ హీరోలు విలన్ పాత్రలకు ఓకే చెప్పి తమ కెరీర్ ను దూసుకుపోయేలా చేసుకుంటున్నారు.. అలా జగపతి బాబు ఎలాంటి సినిమాలు చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు.. తెలుగులో చాలామంది హీరోలు ఇప్పుడు విలన్ పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.. ఇంతమందిలో మన హీరోలు చేస్తున్న సినిమాలకి విలన్ లు దొరకడం లేదేంటి అని ఓ ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది..

అల్లు అర్జున్ పుష్ప సినిమాకి, మహేష్ సర్కార్ వారి పాట సినిమాకి విలన్ లు లు కరువయ్యారట..ఇద్దరు స్టార్ హీరోలు.. వారు అవసరమనుకుంటే ఇతర భాషలనుంచి మంచి నటుల్ని విలన్ గా తీసుకురావచ్చు కానీ ఎందుకో వీరి సినిమాలకి విలన్ సెట్ కావట్లేదు.. ఇప్పటికే సుకుమార్ పుష్ప సినిమా కోసం చాలామంది విలన్ లను అనుకున్నారు కానీ ఒక్కరు కూడా సెట్ అవలేదు.. అటు మహేష్ కూడా బాలీవుడ్ నటులను ప్రయత్నించినా ఎందుకో విలన్ ఇంతవరకు సెట్ అవలేదు.. దాంతో తెలుగులోనే ఓ విలన్ కి వెళ్తున్నారని తెలుస్తుంది.. ఏదేమైనా సూపర్ స్టార్ హీరోల సినిమాలకి విలన్ దొరకకపోవడమేంటి చిత్రం కాకపోతే..

ఈ హీరోయిన్ గురించి ఆసక్తికర విషయం ఏంటంటే..?

అల్లు అర్జున్ పుష్ప ప్లేస్ మారబోతుందా…?

రామ్ రెడ్ ఇంత చీప్ రేటుకి అడుగుతున్నారా..?

ప్రభాస్ డైరెక్టర్ పై కోపంతో ఉన్న ఫాన్స్..!!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -