Tuesday, May 14, 2024
- Advertisement -

శంకరాభరణం హిట్టయితే ? ప్లాప్ అయితే ? కోనా ప్లాన్ ఏంటి ?

- Advertisement -

బ్రూస్ లీ సినిమా ప్లాప్ భారం మొత్తం శ్రీను వైట్ల మీదకి నెట్టేసాడు కోనా వెంకట్. అఖిల్ సినిమా కి మాటలు మాత్రమే రాసాను అని తప్పించుకుని ఆ ప్లాప్ తో కూడా తనేకేలాంటి సంబంధం లేదు అని బాహాటంగా ప్రకటించేసాడు ఆయన. ఇవాళ శంకరాభరణం విడుదల అవబోతూ ఉండడం తో ఈ సినిమా విషయంలో కోనా చాలా టెన్షన్ గా ఉన్నాడు అని తెలుస్తోంది. 

నిఖిల్ – నందిత హీరో హీరోయిన్ లు గా టాలీవుడ్ ని బీహార్ దాకా తీసుకెళ్ళి క్రైమ్ కామెడీ ని తెరకి ఎక్కించారు. ఈ సినిమా కి ప్రొడ్యూసర్ మాత్రమే కాకుండ కర్త కర్మ క్రియ మన గురువుగారే. నిజానికి ఇది ఒక హిందీ సినిమా రీమేక్. కాబట్టి దాంట్లో పెద్దగా చేసేదే ఏముంటుంది? అయినాసరే శంకరాభరణం కోసం కేవలం రా కాన్సెప్టు మాత్రమే తీసుకొని మిగిలినదంతా నేనే వండాను అంటున్నాడు కోన. 

సినిమా హిట్ అయితే మాత్రం ఆడియన్స్ కి కోనా డప్పు మామూలుగా పడదు అంటున్నారు. ఇంటర్వ్యూ లు మీద ఇంటర్వ్యూ లు ఇచ్చి బ్రూస్ లీ – అఖిల్ – త్రిపుర తో వచ్చిన మచ్చని శంకరాభరణం తో వదిలించేసుకుంటారు కోనా గారు. అదే  తేడా వస్తే ? ప్లాప్ అయితే ? చింత ఎందుకు ? డైరెక్టర్ నందనవనం ఉన్నాడు గా ఆయన మీద తోసేస్తారేమో అంటున్నారు విశ్లేషకులు .

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -