Tuesday, May 7, 2024
- Advertisement -

ఏంటో ప్ర‌భాస్‌, స్వీటీ బంధం తెలియ‌డం లేదు!

- Advertisement -

బాహుబ‌లిలో చూడ‌ముచ్చ‌టైన జంట అనుష్క‌, ప్ర‌భాస్‌. వీరిద్ద‌రి కాంబినేష‌న్ ఎప్పుడూ హిట్టే. మిర్చి, బిల్లా, బాహుబ‌లి (1,2) సినిమాల్లో వీరిద్ద‌రూ క‌లిసి సినీ ప్ర‌యాణం చేశారు. బాహుబ‌లి కోస‌మైతే ఐదేళ్లు త‌మ డేట్స్ కేటాయించారు. ఆ మ‌ధ్య‌లో వీరిద్ద‌రి మ‌ధ్య స‌న్నిహిత్యం బాగా పెరిగింది. త‌ర‌చూ సినిమాలు చేయ‌డంతో వీరి మ‌ధ్య బంధం ధృడ‌మైంద‌ని తెలుస్తోంది. వీరిద్ద‌రూ క‌లిసి ఇప్పుడు ఒక్క సినిమాలో చేయ‌డం లేదు. అయినా త‌ర‌చూ క‌లుసుకుంటున్నారు. ఒక‌రిపై ఒక‌రు పొగ‌డ్త‌లు కురిపించుకుంటున్నారు. దీంతో వీరి మ‌ధ్య బంధం ఏంటో అర్థం కావ‌డం లేదు.

భాగమతి కోసం ప్ర‌భాస్ తెగ ఆత్రంగా ఎదురుచూస్తున్నాడంట‌. అందుకే భాగ‌మ‌తి షూటింగ్‌లో అలా మెరిశాడు. అత‌డు సెట్స్‌కు వ‌చ్చిన విష‌యం ఓ పాట విడుద‌ల‌లో తెలిసింది. అయితే అనుష్క కూడా మొన్న సాహో సెట్స్‌కు వెళ్లి సంద‌డి చేసింది. అంతేకాదు ప్ర‌భాస్ భాగ‌మ‌తి సినిమాలో అనుష్క బాగా న‌టించింద‌ని పొగ‌డ్త‌లు కురిపించాడు. అనుష్క‌ను తెగి పొగిడాడు.

అయితే ఇటీవ‌ల ప్ర‌భాస్ పెద‌నాన్న కృష్ణంరాజు ప్ర‌భాస్ ఓకే అంటే సంబంధాలు చూస్తామ‌ని ప్ర‌క‌టించారు. కానీ ఇవేవీ ప‌ట్టించుకోకుండా ప్ర‌భాస్ అనుష్క వెంట తిరుగుతున్నాడు. కొంప‌దీసి అనుష్క‌తో ప్రేమాయ‌ణం కొన‌సాగిస్తున్నాడో తెలియాలి. ఏది ఏమైనా ఈ 2018లో ఏదో ఒక విష‌యం తేలాల్సిందే. లేదంటే వ‌య‌సు మీరి పోతుంది. ఈపాటికే ప్ర‌భాస్ 40కి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ వ‌య‌సు 38. అనుష్క‌తో పెళ్లియితే అభిమానుల‌కు పండ‌గే. మ‌రో విరుష్క జంట‌గా వీరు పేరు పొందే అవ‌కాశం ఉంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -