Thursday, May 9, 2024
- Advertisement -

శిష్యుడి త‌ర్వాత గురువుకే గుడి

- Advertisement -

చంద్ర‌బాబుకు ఓ గుడి

తెలుగు రాజ‌కీయాల్లో గురుశిష్యులు అధికారంలో ఉన్నారు. ఇద్ద‌రు చెరో రాష్ట్రానికి ముఖ్య‌మంత్రులుగా కొన‌సాగుతున్నారు. వీరిద్ద‌రూ రాజ‌కీయ దురంధులుగా పేరు పొందుతున్నారు. ఇప్పుడు వీరిద్ద‌రికీ మ‌రో పోలిక ఉంది. మొద‌ట గురువు త‌ర్వాత శిష్యుడు అంటారు. గానీ వీరిద్ద‌రి విష‌యంలో శిష్యుడి త‌ర్వాత గురువుగా చెప్పుకోవాలి. వీరిద్ద‌రికి రెండు రాష్ట్రాల్లో గుళ్లు ఉండ‌బోతున్నాయి.

ఇప్ప‌టికే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు తెలంగాణ‌లో ప‌లుచోట్ల గుళ్లు ఏర్పాట‌య్యాయి. బ‌తికి ఉండ‌గానే విగ్ర‌హాలు పెట్టేశారు. వీట‌న్నిటి క‌న్నా హైద‌రాబాద్‌లోని వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యం ద్వారం ప‌క్క‌న సీఎం కేసీఆర్‌కు గుడి క‌ట్టడం అంద‌రీ దృష్టి ప‌డింది. ఆ త‌ర్వాత ఇప్పుడు అత‌డి గురువు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుకు గుడి క‌ట్ట‌నున్నారు. అయితే చంద్ర‌బాబుకు మ‌రో ప్ర‌త్యేక‌త ఉండ‌నుంది. గుడిలో ప్ర‌త్యేకంగా చంద్ర‌బాబు వెండి విగ్ర‌హం పెట్టేందుకు సిద్ధమ‌య్యారు.

కర్నూలు జిల్లా నంద్యాల నుంచి మహానందికి వెళ్లే మార్గంలో గుడి కట్టేందుకు హిజ్రాలు అవసరమైన స్థలం గుర్తించారు. చంద్రబాబు వెండి విగ్రహాన్నిసిద్ధం చేశారంట‌. త్వరలో గుడి నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ఏపీ ప్ర‌భుత్వం హిజ్రాలకు ప్రతినెలా రూ.1,500 పింఛ‌న్, పక్కాగృహం, వ్యాపారం చేసుకునేందుకు సబ్సిడీతో కూడిన బ్యాంకు రుణాలు ఇవ్వాలని నిర్ణ‌యించడంతో చంద్ర‌బాబుకు గుడి క‌ట్టి కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకోబోతున్నారు హిజ్రాలు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -