Monday, April 29, 2024
- Advertisement -

మహేష్ బయపడుతున్నాడా?

- Advertisement -

ఇష్క్, మనం సినిమాలతో తెలుగులో తన టాలెంట్ ఎంటో నిరుపించుకున్నాడు దర్శకుడు విక్రమ్‌ కుమార్‌. ఇప్పటి వరకు ఈ దర్శకుడు చేసిన సినిమాలు అన్ని మంచి విజయం సొంతం చేసుకున్నవే. ఈ దర్శకుడితో పని చేయడానికి చాల మంది హీరోలు ఎదురు చూస్తున్నారు అప్పట్లో సూపర్ స్టార్ మహేష్ బాబు విక్రమ్‍ని తన ఇంటికి పిలిపించి ఒక మంచి కథ ఉంటే చెప్పమని అడిగాడట.

ఐతే విక్రమ్ తన దగ్గరున్న ఓ అద్భుతమైన కథ చెప్పడట. కథ చాలా అద్భుతంగా ఉంది కానీ ఈ కథతో నేను సినిమా చేస్తే ప్రేక్షకులు అదరిస్తారో లెదో అని చెప్పి వేరే ఎదైన కథ ఉంటే పట్రమ్మన్నాడట. అదే కథను హీరో సూర్యకి చెప్పడట విక్రమ్ కథ నచ్చడంతో సూర్య చేయాడానికి ఓప్పుకున్నాడు. అదే కథ ఇప్పుడు ’24’ చిత్రంగా రూపొందుతోంది.

ఈ మధ్యనే ఈ సినిమాకి సంబంధించి కొత్త స్టిల్స్ రిలీజ్ చేసారు. ఇందులో సూర్య కొత్త కొత్త గెటప్స్‌తో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నాడు. అప్పట్లో సూర్య నటించిన గజిని సినిమాని మొదట తెలుగులో మహేష్‍నే రీమేక్ చేయమని అడిగారట కానీ మహేష్ చేయలేదు. గజిని సినిమాతో సూర్య తెలుగు ప్రేక్షకులకు దగ్గర్వడమే కాక తెలుగులోను మార్కేట్ సంపదించుకున్నాడు.

మళ్లీ మహేష్‍కు చెప్పిన కథ సూర్య దగ్గరికే వేళ్ళింది. ఈ సినిమాతో సూర్య ఇంకెన్ని బెనిఫిట్స్‌ పొందుతాడో తెలియాలి అంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. మహేష్ బాబు 1 నేనొక్కడినే అన్ని సినిమాలకు కొంచెం డిపరేంట్ సినిమా. 1 నేనొక్కడినే సినిమాతో ప్రయోగం చేసిన మహేష్ ఆ సినిమా ప్లాప్ కావడంతో అలాంటి సినిమాల జోలికి పోవాడం లేదు. కానీ విక్రామ్‍కి మాత్రం ఎలాగైన మహేష్‍తో సినిమా చేయాలి అని ఆశట. సూర్యతో చేస్తున్న సినిమా అయిపోగానే మహేష్ కోసం ఓ మంచి కథ సిద్దం చేయనున్నాడట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -