ఈ సంక్రాంతి విడుదలైన సినిమాలు తెగ సందడి చేశాయి. అన్ని మంచి సినిమాలై కావడంతో అభిమానుల భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయ్యాయి. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, బాలకృష్ణ డిక్టేటర్, నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన, శర్వనంద్ ఎక్స్ ప్రెస్ రాజా ఈ నాలుగు సినిమాలు రిలీజ్ అయిన తొలి షో నుంచే మంచి పాజిటివ్ టాక్‍తో దూసుకేల్తున్నాయి.
ముఖ్యంగా నాన్నకు ప్రేమతో సినిమాపై భారి అంచనాలు ఉండటంతో రిలీజ్ అయిన మొదటి రోజే మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఇక ఈ సినిమా విషయనికి వస్తే ఆశించినంతగా లేదు అనే టాక్ వినిపిస్తుంది. ఇంకోందరు ఎన్టీఆర్ మంచి సినిమా తీశారు అనే వారు కూడా ఉన్నారు. ఏది ఎమైన ఈ సినిమాకి ఇంకా మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి.
ఇక బాలయ్య డిక్టేటర్ సినిమా సంగతి కూడా ఇలానే ఉంది. కేవలం బాలయ్య అభిమానులు ఈ సినిమాని తెగ ఎంజాయ్ చెస్తారు. కేవలం మాస్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడం వల్ల ఈ సినిమాకి ఫ్యామీలీస్ వచ్చే అవకాశం తక్కువే. ఇక శర్వనంద్ ఎక్స్ ప్రెస్ రాజా చిన్న సినిమాగా వచ్చి మంచి కామిడీ హిట్ అయ్యింది. సినిమానిండా దర్శకుడు కామిడీతో నింపేసాడు.
పెద్ద సినిమాలు ఉండటంతో ఈ సినిమాకి ప్రేక్షకులు నెంమదిగా కానేక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన మాత్రం పై మూడు సినిమాలకు పెద్ద పోటి ఇచ్చింది. రిలీజ్ అయిన మొదటి రోజునే మంచి టాక్ సంపాదించింది. ఫ్యామిలీ ఆడియన్సు, మాస్ ఆడియన్సు అందరిని రప్పిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమానే సంక్రాంతి విజేత అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకో వారం రోజులు ఆగితే సంక్రాంతి విజేత ఎవరు అనేది క్లారిటి రానుంది.
