Thursday, May 2, 2024
- Advertisement -

మోస‌పోయా? అందుకే ఐట‌మ్ సాంగ్ చేస్తున్నా!

- Advertisement -

రెజీనాను మోసం చేసిన హీరో ఎవ‌రు?

తెలుగు సినిమాల్లో చిన్న చిన్న సినిమాలు చేస్తూ వెళ్తున్నా మంచి హిట్‌.. పెద్ద సినిమా ఇంత‌వ‌ర‌కు రాలేదు. అవ‌కాశాలు లేక చేసిన హీరోల‌తోనే సినిమాలు చేస్తున్నా భామ‌పై ఇప్పుడు కొన్ని రుమార్లు, పుకార్లు బీభ‌త్సంగా వ‌స్తున్నాయి. ఆ హీరోయినే రెజీనా క‌సండ్రా. అయితే ఈ హీరోయిన్‌ను ఒక హీరో మోసం చేశాడ‌ని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

తెలుగు సినిమాలో రెజీనా మొద‌టి అవ‌కాశం సందీప్ కిష‌న్‌తో న‌టించింది. ఈ అమ్మ‌డికి అవ‌కాశాలు వ‌స్తూనే ఉన్నా సూప‌ర్‌హిట్‌గా నిలిచే సినిమాలు ఏవీ రాలేదు. చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. ఆ సినిమాలు కూడా ఆమెకు ఎలాంటి ఎంక‌రేజ్‌మెంట్ చేయ‌లేదు. అయితే తాజాగా ఆమె కెరియ‌ర్ మంద‌గించ‌డానికి ఓ కార‌ణం ఉందంట‌. ఆ కార‌ణం వింటే మీరే షాక‌వుతారు. ప్రేమలో పడడంతోనే తన కెరీర్ నెమ్మ‌దించింద‌ని ఇటీవ‌ల చెప్పేసింది. ఇకపై అలాంటి పని ఎప్పుడూ చేయనని చెప్పింది. అయితే ఆమె ప్రేమ‌లో ప‌డింది ఎవ‌రో అని టాలీవుడ్ అంతా గుస‌గుస‌లాడుతోంది.

రెజినా సందీప్ కిషన్, సాయిధ‌రమ్ తేజ్‌, నారా రోహిత్‌తో వ‌రుస సినిమాలు చేసింది. ఇక సందీప్‌కిష‌న్‌తోనైతే రెచ్చిపోయి న‌టించింది. హాట్‌హాట్ సీన్లు చేసేసింది. అయితే మరి ఇప్పుడు ఆమె చెప్తోన్న హీరో ఎవరనేది జనానికి సస్పెన్స్‌గా ఉన్నా కూడా ఊహించుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు ఆమెకు ఒక్క అవ‌కాశం లేదు. ‘అ’ సినిమా మిన‌హా. ఇక అవ‌కాశాలు లేవ‌ని ఊరుకోకుండా ఐట‌మ్ సాంగ్స్ చేయ‌డానికి ఒప్పేసుకుందంట‌.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -