Thursday, May 16, 2024
- Advertisement -

బాబోయ్ ఇది భారీ న్యూస్ : బాహుబలి చావలేదు ..

- Advertisement -

” బాహుబలి ని కట్టప్ప ఎందుకు చంపాడు ? ” ఈ దశాబ్దానికి అతిపెద్ద ప్రశ్న గా ఇది ఉండిపోయింది. బాహుబలి 2 ని రాజమౌళి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తే తప్ప దీనికి సమాధానం దక్కే అవకాశం కనపడ్డం లేదు. అసలే బాహుబలి ని కట్టప్ప ఎందుకు చంపాడు రా బాబూ అని తలలు పట్టుకుంటూ ఉంటే ఇప్పుడు ఒక కొత్త వ్యవహారం బయటపడింది.

ఈ విషయం తెలిసాక మన ప్రశ్నల లిస్టు ఇంకా పెరుగుతుంది. బాహుబలి సినిమా కి కథ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్ , రాజమౌళి కన్న తండ్రి అయిన ఈయన చెబుతున్న షాకింగ్ న్యూస్ వింటే మీరూ షాక్ అవుతారు. ఆయన్ని ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అన్న ప్రశ్న కామనే గాబట్టి ముందే పంచ్ రెడీ చేసి పెట్టుకుంటున్నారు.

గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్నకు బాహుబలిని కట్టప్ప చంపలేదు జస్ట్ పొడిచాడు అంతే అని సమాధానం ఇచ్చారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్ళి అదే ప్రశ్నకు బాహుబలి చనిపోయాడని ఎందుకు అనుకుంటున్నారు? బ్రతికివుండే అవకాశాలు కూడా వున్నాయిగా అంటూ కొత్త ఆశలు రేకెత్తించారు. ఒకవేళ ఈ కాన్సెప్ట్ నిజమైతే బాహుబలి రెండో భాగంలో ఇద్దరు ప్రభాస్ లు కనువిందు చేసే ఆస్కారం వుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -