Friday, May 3, 2024
- Advertisement -

ప్ర‌దీప్ కౌన్సిలింగ్‌కు హ‌జ‌రుకాక‌పోవ‌డానికి కార‌ణం అదేనా…?

- Advertisement -

ప్ర‌ముఖ యాంక‌ర్ ప్ర‌దీప్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసుల‌కు అడ్డంగా దొరికిపోవ‌డంతో ఆ వార్త సంచ‌ల‌నంగా మారింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు కౌన్సిలింగ్ హాజ‌రు కాక‌పోవ‌డంతో ప‌లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. నాలుగు రోజులు అవుతున్నా అజ్ణాతంనుంచి ప్ర‌దీప్ బ‌య‌ట‌కు రావ‌డంలేదు. అయితే ఎక్క‌డున్నాడో కూడా తెలియ‌డంలేదు.

పీక‌ల దాకా మ‌ద్యం తాగి డ్రైవ్ చేస‌కుంటూ వ‌చ్చిన ప్ర‌దీప్‌పై పోలీసుల‌కు అనుమానం రావ‌డంతో బ్రీత్‌ అనలైజ్ చేయగా.. ఒకటి రెండు కాదు ఏకంగా 178 పాయింట్లు నమోదు కావడం గమనార్హం. ఎక్కువ మోతాదులో మ‌ద్యం మాత్ర‌మే సేవించి ఉంటే కారును ఎలా న‌డ‌ప‌గ‌ల‌డ‌నే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. బ్రీత్ అన‌లైజ‌ర్ టెస్ట్‌లో 178 పాయంట్లు వ‌చ్చాయంటే మద్యంతోపాటు డ్ర‌గ్స్ కూడా ఏమైనా తీసుకున్నాడ‌న్న అనుమానాల‌కు తావిస్తోంది.

ప్రదీప్ కేవలం మందు మాత్రమే కాదు డ్రగ్స్ ఏమైనా తీసుకున్నాడేమో అందుకే మరిన్ని టెస్ట్ లు చేస్తే దొరికిపోతానని ఇలా పారిపోయాడనే మాటలకు ఇప్పుడు బలం చేకూరింది . ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలీదు కాని ప్ర‌దీప్ కౌన్సిలింగ్‌కు హాజ‌ర‌యితే గాని నిజా నిజాలు బ‌య‌ట‌కు రావు.

ఇదంతా సరే కాని ప్రదీప్ కారులో ఉన్న ఆయువతి హైదరాబాద్ నగరానికి చెందిన లీడర్ కుమార్తె అని కొందరు కాదు కాదు… తూర్పుగోదావరి జిల్లా నేత కుమార్తె అని ఇంకొందరు చెబుతున్నారు. అయితే వీటిలో ఏది నిజమో తెలియదు కాని మొత్తానికి ఆ అమ్మాయి సెలబ్రెటీ కుమార్తె అని తెలిసిపోయింది. అందుకే ప్రదీప్ ను ఈ మ్యాటర్ నుంచి తప్పించడానికి తెర‌వెనుక రకరకాల కసరత్తులు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -